‘శైలజారెడ్డి అల్లుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

September 14, 2018 at 11:44 am
sailaja reddy alludu, First day collections, World wide, Naga chaitanya,

నిన్న వినాయక చవితి సందర్భంగా అక్కినేని ఫ్యామిలీ నుంచి రెండు సినిమాలు వచ్చాయి. అక్కినేని నాగ చైతన్య దంపతుల సినిమాలు ఒకటి శైలజారెడ్డి అల్లుడు, యూటర్న్. కామెడీ దర్శకులు మారుతి దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య, అను ఇమాన్యుయెల్ జంటగా నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’సినిమా నిన్నే మిశ్రమ స్పందన వచ్చింది.

కాకపోతే ఈ సినిమాలో నాగచైతన్య, ర్యమకృష్ణల నటనకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. కామెడీ ఎంటర్టైనర్లు తీయడంలో దిట్ట అయిన దర్శకుడు మారుతి యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్యతో తీసిన సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా భారీ అంచనాలతోనే థియేటర్లో రిలీజ్ అయ్యింది.

అయితే ఈ సినిమాతోనే చైతూ సతీమణి సమంత నటించిన ‘యూటర్న్’ కూడా మంచి టాక్ తెచ్చుకుంది. ఆంధ్రలోని కృష్ణా జిల్లాలో ఈ చిత్రం మొదటి రోజు రూ.39,53,342 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈచిత్రం అటు ఓవర్శిస్ లో కూడా మంచి వసూళ్లను సాధిస్తుంది. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సితారఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. ఈచిత్రం నాగ చైతన్య కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ ను రాబట్టే చిత్రం అవ్వడం ఖాయం గా కనిపిస్తుంది.

తాజాగా శైలజారెడ్డి ఏరియావైజ్ కలెక్షన్లు :

Collections

‘శైలజారెడ్డి అల్లుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share