నిర్మాత‌గా స‌మంత‌..!

September 16, 2018 at 11:06 am

కాలం క‌లిసివ‌స్తే.. ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతుందంటే ఇదేనేమో..! అక్కినేని కోడ‌లు స‌మంత.. అదేనండీ సామ్ విష‌యంలో ఇదే జ‌రుగుతోంది. పెళ్లికి ముందు.. ఆ త‌ర్వాత కెరీర్‌ప‌రంగా ర‌య్‌మంటూ దూసుకుపోతోంది. వ‌రుస విజ‌యాల‌ను సొంతం చేసుకుంటోంది. అయినా ఆమెకూ కోరిక ఉంది.. దానికి తీర్చుకునే స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతోందని చెబుతోంది. అదెప్పుడో క‌చ్చితంగా టైం చెప్ప‌క‌పోయినా.. దానిని ఆ ప‌నిని మాత్రం చేస్తాన‌ని అంటోంది. అయితే.. ఇంత‌కీ ఏమిటా కోరిక‌.. ఏమిటా ప‌ని? అని తెలుసుకోవాల‌నుకుంటున్నారా..? అయితే మీరు ఈ చిన్న‌క‌థ‌నం చ‌ద‌వాల్సిందే మ‌రి. ఏం మాయ చేసేవె సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేసిన స‌మంత.. ఎవ‌రూ ఊహించ‌నంత రేంజ్‌కు చేరుకుంది.

1532178562-Samantha_Akkineni

ఇక అక్కినేని నాగ‌చైత‌న్య‌ను వివాహం చేసుకున్న త‌ర్వాత సామ్ ఇమేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. పెళ్ల‌యిన త‌ర్వాత సామ్ ఇక సినిమాలకు ఫుల్‌స్టాప్ పెడుతుంద‌న్న ఊహాగానాలు చెక్‌పెడుతూ.. మ‌రింత బిజీగా మారింది. ఇటీవ‌ల విడుద‌ల అయిన యూట‌ర్న్ సినిమా కూడా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇందులో కీ రోల్ పోషించిన స‌మంత న‌ట‌న‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లుకురుస్తోంది. థియేట‌ర్లు కూడా ప్రేక్ష‌కుల‌తో నిండిపోతున్నాయి. ఇక ఇదే స‌మ‌యంలో విడుద‌ల అయిన శైల‌జారెడ్డి అల్లుడు సినిమా కొంత వెన‌క‌బ‌డింద‌నే చెప్పుకోవ‌చ్చు. ఇందులో నాగ‌చైత‌న్య హీరోగా న‌టించిన విష‌యం తెలిసిందే. ఇలా పోల్చ‌డం స‌రికాదుగానీ.. భార్య‌భ‌ర్త‌ల సినిమాలు ఇకే రోజు విడుద‌ల కావ‌డంతో అనుకోకుండానే.. జ‌నంలో ఆ టాక్ వ‌స్తుంది.

dc-Cover-8sv31etvqnesr4lppbqh5c60l3-20171013024153.Medi

అయితే.. ఇక్క‌డ సామ్ కోరిక గురించి చెప్పుకోవాలి క‌దా..! చైతూతో పెళ్ల‌యిన త‌ర్వాత స‌మంత నిర్మాత‌గా మారుతుంద‌నీ.. అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్లు నిర్మిస్తుందంటూ జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. కానీ.. ఈ ఊహాగానాలు స‌మంత కొట్టిపారేసింది. ఇదే స‌మ‌యంలో త‌న మ‌న‌సులో మాట‌ను చెప్పుకొచ్చింది.` సినిమాలు నిర్మించాలని ఉంది. కాకపోతే అంద‌రూ అనుకుంటున్న‌ట్లుగా.. అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పైగానీ… మనం ఎంటర్ టైన్ మెంట్స్ పైగానీ సినిమాలు తీయను. నా డబ్బుతోనే నేను సొంతంగా చిన్న సినిమాలు నిర్మిస్తాను. నాకు నా సినిమాను స్క్రీన్ పై చూసుకోవాలని ఉంది.` అంటూ సామ్ క్లారిటీ ఇచ్చింది.

అంతేగాదు.. మ‌రిన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు కూడా స‌మంత చెప్పింది.. అక్కినేని కుటుంబంలో తనకు ఆ స్వేచ్ఛ ఉంద‌ని చెబుతోంది. `కొత్తవాళ్లతో సినిమా తీస్తాను. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తాను. ఇప్పటికే ఆదిశ‌గా ప్రపోజల్స్ వచ్చాయి. అయితే నేను ఎప్పుడు నిర్మాతగా మారతానో నాకే తెలీదు. దానికి ఇంకా చాలా స‌మ‌యం ఉంది. ప్రస్తుతానికి నాలో నటి ఇంకా అలానే ఉంది. ఇంకా చాలా పాత్రలు పోషించాలి. ఇప్పుడిప్పుడే కెరీర్ పరంగా యూటర్న్, రాజుగారి గది-2 లాంటి సినిమాలతో ఓ కొత్త రకమైన జర్నీ ప్రారంభించాను.` అని అంటోంది స‌మంత‌. ఏదేమైనా.. సూటిగా సుత్తిలేకుండా చెప్ప‌డంలో సామ్ స్టైలే వేరు మ‌రి.

నిర్మాత‌గా స‌మంత‌..!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share