అలా చేయకు సమంతా..తట్టుకోలేం!

September 15, 2018 at 11:14 am

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ‘ఏం మాయ చేసావే’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మళియాళ బ్యూటీ సమంత. ఆ తర్వాత అగ్ర హీరోలతో వరుసగా సినిమాల్లో నటిస్తూ నెంబర్ వన్ పొజీషన్లోకి వెళ్లింది. అయితే సమంత తెలుగు, తమిళ సినిమాల్లో మంచి ఫామ్ లో ఉండగానే తాను ప్రేమించిన అక్కినేని అబ్బాయి..నాగ చైతన్యను వివాహం చేసుకుంది. అయితే సమంత పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తుందా అన్న అనుమానాలు వచ్చాయి..కానీ ఆ తర్వాత వరుసగా ‘మహానటి’,‘రంగస్థలం’, ‘అభిమాన్యుడు’ లాంటి సినిమాతో దుమ్మురేపింది. తాజాగా సమంత నటించిన ‘యూటర్న్’ సినిమా రిలీజ్ అయి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో సమంత నటన కన్నా ఆమె వాయిస్ పై రక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.

dc-Cover-8sv31etvqnesr4lppbqh5c60l3-20171013024153.Medi

‘యు టర్న్‌’ చిత్రం కోసం స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకున్న సమంత ఆకట్టుకోలేకపోయింది. నటన పరంగా అద్భుతంగా అనిపించినా కానీ ఆమె వాయిస్‌ పలు సందర్భాల్లో బాగా ఇబ్బంది పెట్టిందనే కంప్లయింట్స్‌ వస్తున్నాయి. ముఖ్యంగా పర భాష నుంచి వచ్చిన హీరో, హీరోయిన్లు డబ్బింగ్ విషయాల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. ఇదే విషయం ఇప్పుడు సమంత విషయంలో కూడా జరిగింది. సమంత తెరపై కనిపిస్తే చిన్మయి వాయిస్ మాత్రమే వినపడాలని ప్రేక్షకుల మైండ్ సెట్ మారింది. చిన్మయి కాకుండా మరే వాయిస్ తో సమంతను చూడాలని ప్రేక్షకులు కోరుకోవడం లేదు. సమంతకు చిన్మయి వాయిస్ అంతగా సూట్ అయ్యింది.

Samantha-on-About-Dubbing-for-U-Turn-Movie-1536943792-1615

మహానటిలో నత్తి పాత్ర చేయడంతో పాటు ఎక్కువ మాటలు లేని క్యారెక్టర్‌ కావడం వల్ల ఆమె వాయిస్‌పై ఫిర్యాదులు రాలేదు కానీ యు టర్న్‌లాంటి చిత్రాలకి అన్నీ తానే అయి నడిపించాలి. ఇలాంటి చోట్ల ప్రయోగాలకి పోకుండా వుండాలని అభిమానులే సూచిస్తున్నారు. ఇక యూటర్న్ సినిమాలో సమంత కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో మాట్లాడే మాటలు అస్సలు అర్థం కాకపోవడం..చాలా మైనస్ అయ్యింది.

ఇకముందు సమంత నటించే సినిమాల్లో ఇలాంటి కొత్త ప్రయోగాలకు తావు ఇవ్వకుండా ఉంటే మంచిదని..మరీ అంతగా నటించాలంటే..పూర్తి స్థాయిలో పట్టు సాధించన తర్వాత ప్రయోగాలు చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు. అందుకే ఇకపై తెలుగులో ఆమె నటించే సినిమాలకు సొంతంగా డబ్బింగ్ వద్దు అంటూ ఆమె అభిమానులు మరియు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అలా చేయకు సమంతా..తట్టుకోలేం!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share