నాకు పిల్లలంటే ఎంతో ఇష్టం..కానీ చైతూ మాత్రం!

September 12, 2018 at 9:59 am

టాలీవుడ్ లో అక్కినేని నాగార్జున తనయుడు ‘జోష్’సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఏం మాయ చేసావే సినిమాతో అద్భుతమైన విజయం అందుకున్నాడు. ఈ సినిమాలో నటించి సమంత రీల్ లైఫ్ లోనే కాదు..రియల్ లైఫ్ లో కూడా ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన తర్వాత భార్యాభర్త ఇద్దరు సినిమా షూటింగ్ బిజీలో ఉన్నారు. ఇప్పటికే సమంత నటించిన రంగస్థలం, అభిమన్యుడు సూపర్ హిట్ అయ్యాయి.

ప్రస్తుతం సమంత నటించిన యూటర్న్ విడుదలకు సిద్దంగా ఉంది. మరోవైపు నాగ చైతన్య నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు ’కూడా రిలీజ్ కి సిద్దంగా ఉంది. తాజాగా యూటర్న్ ప్రమోషన్ లో సమంతకు కొన్ని ప్రశ్నలు ఎదురుయ్యాయి..మీరు ఎప్పుడు తల్లి కాబోతున్నారు..నాగార్జునను తాతను చేసేదెప్పుడు? అంటూ మీడియా ప్రశ్నించింది. పిల్లలంటే తనకు చాలా ఇష్టమని, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాగచైతన్య మాత్రం రెడీగా లేడని అంటోంది సమంత.

Samantha-Interview5

పిల్లలు ఎప్పుడనేది ఇంకా ప్లాన్ చేయలేదు. ఇప్పుడు ఇద్దరి కెరీర్ మంచి ఫామ్ లో నడుస్తుంది..ఈ సమయంలో పిల్లలు అంటే చైతూ కి ఇంట్రెస్ట్ లేనట్లు అనిపిస్తుందని అన్నారు. లకు సంబంధించి చై ఎప్పుడు డేట్ ఫిక్స్ చేస్తాడో ఏమో?” ఇలా పిల్లలకు సంబంధించి తన చేతిలో ఏం లేదని తేల్చేసింది సమంత. ఒకవేళ మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఈసారి చైతూని అడగమని సలహా ఇచ్చింది.

ఓ భార్యగా, నా భర్త ఆనందం నాకు చాలా ఇంపార్టెంట్. అతడికే సక్సెస్ రావాలని కోరుకుంటాను. ఇక సినిమాల పరంగా నాదీ..మా వారిది విడుదల అవుతున్నాయి..నా భర్త సినిమా హిట్ కావాలని కోరుకుంటా..అదే సమయంలో నా సినిమా మరింత హిట్ కావాలని కోరుకుంటా..ఎందుకంటే..ఈ సినిమాతో నాకు కావాల్సింది మంచి పేరు కాదు, డబ్బు కావాలి. ఇక భవిష్యత్ లో మంచి క్యారెక్టర్స్ దొరికితేనే చేస్తానని..రెగ్యులర్ హీరోయిన్ పాత్రలు చేయనని తేల్చి చెప్పేసింది సమంత. కవేళ మంచి క్యారెక్టర్లు దొరక్కపోతే ఇంట్లో ఖాళీగా కూర్చుంటానని, ఒకప్పటిలా అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన అవసరం తనకు లేదంటోంది.

నాకు పిల్లలంటే ఎంతో ఇష్టం..కానీ చైతూ మాత్రం!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share