బిగ్ బాస్ నుంచి జంప్‌… సంపూ క‌ట్టే పెనాల్టీ తెలిస్తే షాకే

బిగ్ బాస్ షో నుంచి సంపూ అర్దాంత‌రంగా వెళ్లిపోవ‌డం బిగ్ బాస్ అభిమానుల‌కు పెద్ద షాక్‌. బిగ్ బాస్ అంతా ఓ ఏడుపుగొట్టు షో అయిపోయింద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇక సంపూ తాను ఇక్క‌డ ఉండ‌లేన‌ని బిగ్ బాస్‌ను వేడుకోవ‌డంతో బిగ్ బాస్ సంపూను బ‌య‌ట‌కు పంపేశాడు.

సంపూ బిగ్ బాస్ హౌస్ నిబంధ‌న‌లు అతిక్ర‌మించి బ‌య‌ట‌కు వెళ్లినందుకు గాను సంపూకు భారీ పెనాల్టీ ప‌డింద‌ట‌. దాదాపుగా రూ.16 ల‌క్ష‌లు సంపూ బిగ్ బాస్ కి చెల్లించాల్సివ‌చ్చింద‌ని తెలుస్తోంది. షో నుంచి ఎలిమినేట్ రూపంలో కాకుండా, సొంత కార‌ణాల‌తో బ‌య‌ట‌కు వ‌చ్చేయాల‌నుకొంటే, నిబంధ‌న‌ల ప్ర‌కారం ఇవ్వాల్సిన పారితోష‌కం కాకుండా పెనాల్టీ క‌ట్టాల్సి వ‌స్తుంద‌ట‌.

ఈ నేప‌థ్యంలోనే సంపూకు రూ. 16 ల‌క్ష‌ల పెనాల్టీ ప‌డిన‌ట్టు తెలుస్తోంది. కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేముందు కొంత డిపాజిట్ చేస్తార‌ట‌. వారు మ‌ధ్య‌లో కార‌ణం లేకుండా బ‌య‌ట‌కు వ‌స్తే ఆ సొమ్ము వాప‌సు ఉండ‌ద‌ని స‌మాచారం. ఇక 70 రోజులు సంపూ బిగ్‌బాస్ సెట్లో ఉంటే.. దాదాపుగా రూ.70 ల‌క్ష‌ల వ‌ర‌కూ సంపాదించే అవ‌కాశం ఉండేది. మ‌ధ్య‌లో రావ‌డం వ‌ల్ల‌.. ఒప్పందాన్ని అర్థాంత‌రంగా ర‌ద్దు చేసుకోవ‌డం వ‌ల్ల సంపూ రూ.16 ల‌క్ష‌లు న‌ష్ట‌పోవాల్సివ‌చ్చింది.