సీన్ లేని ‘స‌ర్కార్’ కు…ఫస్ట్ డే అన్ని కోట్ల!

November 7, 2018 at 1:18 pm

ద‌ర్శ‌కుడు మురుగుదాస్‌, హీరో విజ‌య్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన స‌ర్కార్ సినిమాపై భిన్న‌మైన టాక్ వినిపిస్తోంది. ఇది మురుగుదాస్ మార్క్‌లేని సినిమా అనే విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. మొత్తంగా ఈ చిత్రం నెగెటివ్ టాక్ వ‌చ్చింది. అయితే.. నెగెటివ్ టాక్ స‌హ‌జంగానే వ‌సూళ్ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. కానీ.. ఈ సినిమా ప్రొడ్యూస‌ర్స్ చెబుతున్న మాట వింటే మాత్రం అంద‌రూ నోరెళ్ల బెట్టాల్సిందే. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా ఏకంగా రూ.50కోట్లు వ‌సూలు చేసింద‌ని అంటున్నారు.

pjimage-3-19-784x441

అయితే.. ఇది నిజం కాదనే టాక్ ట్రేడ్‌వ‌ర్గాలు అంటున్నాయి. నిజానికి.. ఈ సినిమా మొద‌టి రోజు మొత్తం రూ.30కోట్లు వ‌సూలు చేయ‌గా.. ప్రొడ్యూస‌ర్స్ రూ.17కోట్లు షేర్ చేసి ఉంటారని అంచ‌నా వేస్తున్నాయి. అయితే.. ప్రొడ్యూస‌ర్స్ చెబుతున్న రూ.50కోట్ల‌కు, ట్రేడ‌వ‌ర్గాలు చెబుతున్న రూ.30కోట్ల‌కు మ‌ధ్య ఏకంగా రూ.20కోట్ల తేడా ఉంది. అయితే.. ఈ సినిమా రూ.50కోట్లు వ‌సూలు చేసింద‌ని ప్రొడ్యూస‌ర్స్ ఎలా స‌మ‌ర్థించుకుంటున్నారో చూడండి.

ఒక‌వేళ‌.. సింగిల్ స్క్రీన్‌, మ‌ల్టీఫ్లెక్స్‌ల్లో పాప్‌కార్న్‌, పార్కింగ్‌, కాఫీ బిజినెస్ తాము తీసుకుని ఉంటే.. ఈ రూ.50కోట్లు ట‌చ్ చేసి ఉండేద‌ని అంటున్నారు. ఇది నిజంగా పెద్ద జోక్ అనే చెప్పాలి. వ‌సూలు చేసిన సుమారు రూ.30కోట్ల‌కు మ‌రో రూ.20కోట్లు క‌లుపుకుని మొత్తం యాభైకోట్లు వ‌సూలు చేసిన‌ట్లు చెప్పుకోవ‌డం వింత‌గానే ఉంద‌ని ఇండ‌స్ట్రీవ‌ర్గాలు అంటున్నాయి. త‌మ సినిమా భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింద‌ని చెప్పుకుని ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించేందుకు ఇలాంటి చీప్ ట్రిక్స్ ఉప‌యోగిస్తారా..? అని ప‌లువురు సెటైర్లు వేస్తున్నారు.

సీన్ లేని ‘స‌ర్కార్’ కు…ఫస్ట్ డే అన్ని కోట్ల!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share