విజయ్ ‘సర్కార్’ టీజర్..అదిరింది కానీ!

October 24, 2018 at 10:43 am
Sarkar - Official Teaser, Thalapathy Vijay, Sun Pictures, AR Murugadoss

ఇళ‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ ఇమేజ్‌.. మార్కెట్ వ్యాల్యూ ఏ స్థాయిలో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగులోనూ ఆయ‌నకు మాంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా మురుగుదాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న న‌టిస్తున్న చిత్రం స‌ర్కార్‌. సామాజిక అంశాల‌ను జోడించి, హిట్ కొట్ట‌డంలో మురుగుదాస్‌, అలాంటి పాత్ర‌ల‌కు త‌న‌దైన న‌ట‌న‌తో ప్రాణం పోయ‌డంలో విజ‌య్.. ఇద్ద‌రూ ఇద్ద‌రే. అయితే.. ఇటీవ‌ల త‌మిళంలో విడుద‌ల అయిన స‌ర్కార్ సినిమా టీజ‌ర్‌కు ఆయ‌న అభిమానుల రెస్పాన్స్ మామూలుగా లేదు. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ అని చెబుతున్న `థగ్స్ ఆఫ్ హిందూస్తాన్` – హాలీవుడ్ బ్లాక్ బస్టర్ `అవెంజర్స్: ఇన్ ఫినిటీ వార్` చిత్రాల టీజర్లను మించి `సర్కార్` టీజర్ కి యూట్యూబ్ లో ఆదరణ దక్కిందంటే… విజ‌య్ హ‌వా ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.

తాజాగా.. స‌ర్కార్ సినిమా తెలుగు టీజ‌ర్ విడుద‌ల అయింది. తెలుగులో ఈ సినిమా ప్ర‌మోష‌న్ వ‌ర్క్ అంత‌గా చేప‌ట్ట‌డం లేద‌నే చెప్పాలి. ఎందుకంటే.. ఈ సినిమాను దీపావ‌ళి కానుక‌గా విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. కానీ..పెద్ద‌గా ప్ర‌మోష‌న్ వ‌ర్క్ మాత్రం క‌నిపించ‌డం లేదు. ఇదిలా ఉండ‌గా.. తెలుగు టీజ‌ర్ లో వాయిస్ ఎఫెక్టివ్‌గా లేక‌పోవ‌డం పెద్ద మైన‌స్‌గా క‌నిపిస్తోంది. “అతనొక కార్పొరెట్ మాన్ స్టర్.. ఏ దేశానికి వెళ్లినా తనని ఎదిరించిన వాళ్లను అంతం చేసి వెళతాడు! అతనిప్పుడు ఇండియాకు వచ్చాడు!“ అంటూ వరలక్ష్మి శరత్ కుమార్ వాయిస్ తో ఈ టీజర్ మొద‌లైంది. అయితే.. విజ‌య్ పాత్ర గాంభీర్యానికి త‌గ్గ‌ట్టుగా వ‌ర‌ల‌క్ష్మి వాయిస్ లేక‌పోవ‌డం కొంత ఇబ్బందిగానే అనిపిస్తోంది. ఆమె పందెం కోడి-2లో చెప్పిన వాయిస్ ప‌ర్ఫెక్ట్‌గానే సూట్ అయింది. కానీ.. స‌ర్కార్‌లో మాత్రం తుస్సుమ‌నిపించింది.

ఇండియాలో కొన‌సాగుతున్న రాజ‌కీయాల‌కు అద్దం ప‌ట్టేలా.. వాటిని స‌రైన దారిలోకి తీసుకొచ్చే లైన్‌తో మురుగుదాస్ ఈ చిత్రాన్ని తీసిన‌ట్లు టీజ‌ర్‌లో తెలిసిపోతుంది. “నేను ఏ కంపెనీ కొనడానికి రాలేదు.. ఇవాళ ఏ రోజు.. ఎలక్షన్ డే .. నేను నా ఓటు వేయడానికి వచ్చాను.. ఇంకా ఒక్కరోజులో ఏం మారుతుందో మారబోతోందో మూల కూచుని వేడుక చూడండి.. ఐ యామ్ ఏ కార్పొరెట్ క్రిమినల్“ “మీ ఊరి నాయకుడిని మీరే కనిపెట్టండి.. ఇదే మన `సర్కార్“ అంటూ విజ‌య్ చెప్పిన డైలాగ్స్ మాత్రం అదుర్స్ అనే చెప్పాలి. ఏదేమైనా దీపావ‌ళి కానుక‌గా వ‌స్తున్న ఈ సినిమా తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు ఆట్టుకుంటుందో చూడాలి మ‌రి.

విజయ్ ‘సర్కార్’ టీజర్..అదిరింది కానీ!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share