‘సర్కార్’ ప్రీమియర్ షో టాక్

November 6, 2018 at 8:48 am

విడుదల తేదీ: 05 వ నవంబర్, 2018
దర్శకుడు: AR మురుగదాస్
సంగీత దర్శకుడు: AR రెహమాన్
కొరియోగ్రఫీ: గిరీష్ గంగాధరన్
ప్రొడక్షన్ కంపెనీ: సన్ పిక్చర్స్
స్టారింగ్: విజయ్, కీర్తి సురేష్, వరలక్ష్మి శ‌రత్ కుమార్

ఏదైనా ఒక సామాజిక అంశాన్నిక‌థ‌గా తీసుకుని.. దానికి వాణిజ్య హంగులు జోడించి హిట్ కొట్ట‌డంలో ఏఆర్ మురుగుదాస్‌ది ప్ర‌త్యేక శైలి. ఈ పంథానే ఆయ‌న‌ను ఇండ‌స్ట్రీలో ప్ర‌త్యేకంగా నిల‌బెట్టింది. ఆయ‌న సినిమాల‌కు అటు త‌మిళంతోపాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. ఇక మురుగుదాస్‌, విజ‌య్ కాంబినేష‌న్‌కు ఉన్న క్రేజీయే వేరు. క‌త్తి, తుపాకి సినిమాలు మాంచి విజ‌యాల‌ను అందుకున్నాయి. విజ‌య్‌కు తెలుగులో కూడా ఇమేజ్ ఉంది. తాజాగా వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమా స‌ర్కార్‌. ఎన్నిక‌ల అంశాన్ని క‌థ‌గా ఎంచుకుని మురుగుదాస్ ఈ సినిమా తీశాడు. అయితే.. ప్ర‌స్తుతం ఈ సినిమా ప్రీమియ‌ర్ షో టాక్ ఎలా ఉందో చూద్దాం..

DrRh7lAXgAAyGQl

భార‌త్ ఎన్నిక‌ల్లో ఒక‌రి ఓటును మ‌రొక‌రు వేయ‌డం.. తీరా నిజ‌మైన ఓటరు పోలింగ్ కేంద్రానికి వెళ్లేట‌ప్ప‌టికి అప్ప‌టికే ఓటు వేసి ఉండ‌డం.. ఇక చేసేది ఏమీ లేక అక్క‌డి నుంచి వెనుదిర‌గ‌డం సాధార‌ణంగా చూస్తూనే ఉంటాం. ఇక ఎన్నిక‌ల్లో గెలవ‌డం కోసం నేత‌లు ఎంత‌కైనా దిగ‌జారిపోవ‌డం.. ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసేలా ప్ర‌వ‌ర్తించ‌డం ఇక్క‌డ స‌ర్వసాధార‌ణంగా క‌నిపిస్తూనే ఉంటుంది. ఇదొక చిన్న అంశంగా.. కామ‌న్‌గా జరిగిపోయే అంశమ‌ని, పెద్ద‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌నే భావ‌న ఇక్క‌డి పౌరుల్లోనూ నెల‌కొంది. కానీ.. ఓటు హ‌క్కు అనేది ఎంత ముఖ్య‌మో చూపించేందుకు మురుగుదాస్ ప్ర‌య‌త్నం చేశాడు.

అమెరికాలోని ఓ కార్పొరేట్ కంపెనీలో సీఈవోగా సుంద‌ర్‌(విజ‌య్) క‌నిపిస్తాడు. మాంచి స్టైలిష్ లుక్‌లో ఆక‌ట్టుకుంటాడు. ఎన్నిక‌ల్లో ఓటు వేసేందుకు అక్క‌డి నుంచి చెన్నైకి వ‌స్తాడు. పోలింగ్ కేంద్రానికి వెళ్ల‌గానే అప్ప‌టికే ఆయ‌న ఓటు వేసి ఉంటుంది. ఇక్క‌డ కీర్తి సురేశ్ పోలింగ్ ఏజెంట్‌గా క‌నిపిస్తుంది. త‌న ఓటును ఇత‌రులు వేయ‌డంపై తీవ్ర అస‌హ‌నానికి గురైన విజ‌య్ తిరిగి త‌న ఓటును పొంద‌డానికి న్యాయ‌పోరాటం చేస్తాడు. ఎన్నిక‌ల తీరును మార్చేందుకు నిర్ణ‌యం తీసుకుంటాడు. ఇక్క‌డ భార‌త ఎన్నిక‌ల లా 49-పీ ఆధారంగా కోర్టు కూడా ఆ ఎన్నిక‌ల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త లేద‌ని, 15రోజుల్లో మ‌ళ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని తీర్పునిస్తుంది.

అయితే.. మొద‌టి భాగం మాత్రం సూప‌ర్ అని చెప్ప‌లేం కానీ.. ప‌ర‌వాలేదని అనొచ్చు. ఇక రెండు ఫైట్లు, బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం అదుర్స్ అనే చెప్పాలి. అయితే.. ఇక్క‌డ రాజ‌కీయ సంభాష‌ణ‌ల‌ను ప‌లుచోట్ల బ‌ల‌వంతంగా ఇరికించిన‌ట్లు అనిపిస్తుంది. సెంటిమెంట్ స‌న్నివేశాలు కూడా ఆక‌ట్టుకోలేక‌పోయాయ‌నే టాక్ వినిపిస్తుంది. ఇక‌ సెకండాఫ్ విజ‌య్ ఎన్నిక‌ల ప్ర‌చారంతో మొద‌ల‌వుతుంది. ఇక ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది..? విజ‌య్ విజ‌యం సాధించాడా లేదా..? ఎన్నిక‌ల తీరును మార్చ‌గ‌లిగాడా లేద‌నేది మాత్రం తెర‌పైనే చూడాలి. ఈ సినిమాకు ఏఆర్ ర‌హ‌మాన్ అందించిన సంగీతం అదుర్స్ అనే చెప్పొచ్చు. విల‌న్ పాత్ర‌లో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ ఒదిగిపోయారు.

చివ‌రిగా… బోరింగ్ స‌ర్కార్ కాదుగానీ…

‘సర్కార్’ ప్రీమియర్ షో టాక్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share