‘సవ్యసాచి’ చిట్టిబాబుని ఫాలోవ్ అయితే సరిపోయేది!

November 4, 2018 at 10:02 am

నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన సవ్యసాచి సినిమా భారీ హిట్ కాకపోయినా ఫర్వాలేదు అనే స్థాయిలో ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదనే చెప్పాలి. ముఖ్యంగా దర్శకుడి మీద ఉన్న అంచనాలతో ఈ సినిమా ఓ రేంజ్ లో ఉంటుందనే అందరూ ముందుగా ఊహించారు. కానీ మొదటి షో కి ఫలితం మొత్తం తేలిపోయింది.

Savyasachi_rev

కధనం కొత్తగా ఉన్నా … ఆ కాన్సెప్ట్ ని పట్టాలెక్కించడంలో దర్శకుడు కొంచెం తడబడినట్టు అర్ధం అవుతోంది. అంతకు ముందు ఇదే దర్శకుడు చేతిలో ‘కార్తికేయ’ లాంటి వైవిధ్యమైన సినిమా వచ్చింది. చందూ మొండేటి మళ్ళీ ఇలాంటి కొత్త కాన్సెప్ట్‌తో సినిమా తీస్తున్నాడనగానే ప్రేక్షకుల్లో ఎంతో ఊహించుకున్నారు. కానీ మంచి కాన్సెప్ట్‌ను సరిగా డీల్ చేయలేకపోయాడు దర్శకుడు.

హీరో ఎడమ చేయి అతడి మాట వినకపోవడం అన్నది చాలా థ్రిల్లింగా అనిపించినా … తర్వాత ఈ అంశాన్ని ఎలా వాడుకుంటాడో అని చూస్తే.. తర్వాత తర్వాత దాని ఊసే ఎత్తలేదు. కథనాన్ని నడిపించేందుకు ఈ ‘చేతి’ కాన్సెప్ట్‌ను ఉపయోగించుకోనేలేదు. ఈ విషయంలో ‘రంగస్థలం’ ఏ దర్శకుడికైనా ఒక పాఠం అనే చెప్పాలి. అందులో హీరోకు చెవులు సరిగా వినిపించవు. కథను చాలా వరకు దాని చుట్టూనే తిప్పాడు సుకుమార్. ప్రతి సన్నివేశం హీరో చెవుడుతో ముడిపడి ఉంటుంది. కామెడీ.. రొమాన్స్.. సెంటిమెంట్.. యాక్షన్.. ఇలా ప్రతి విషయంలోనూ… హీరో బలహీనతను సరిగ్గా వాడుకున్నాడు కానీ ఈ సినిమా విషయంలో దర్శకుడు ఆ విధంగా వాడుకోవడంలో ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి.

‘సవ్యసాచి’ చిట్టిబాబుని ఫాలోవ్ అయితే సరిపోయేది!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share