‘సవ్యసాచి’ ప్రీమియర్ షో టాక్

November 2, 2018 at 9:16 am

దర్శకుడు: చందూ మొండేటి
సంగీత దర్శకుడు: ఎం.ఎం. కీరవాణి
న‌టీన‌టులు: నాగ‌చైత‌న్య‌, ఆర్ మాధ‌వ‌న్‌, నిధి అగ‌ర్వాల్‌, భూమిక‌

పెళ్లి త‌ర్వాత నాగ‌చైత‌న్య వ‌రుస‌బెట్టి సినిమాలు చేస్తున్నాడు. మొన్న‌టికి మొన్న శైల‌జ‌రెడ్డి అల్లుడుతో అంద‌రితో మెప్పించాడు. ఈ సినిమాపై మంచి టాక్ వ‌చ్చింది. తాజాగా.. చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య‌, ఆర్ మాధ‌వ‌న్‌, నిధి అగ‌ర్వాల్ నటించిన చిత్రం స‌వ్య‌సాచి. ఇది ప‌క్కా క‌మర్షియ‌ల్ చిత్ర‌మ‌ని చైతూ ఇప్ప‌టికే చెప్పాడు. ఫ‌స్టాఫ్ మొత్తం ఎంట‌ర్‌టైనింగ్‌గా, రొమాంటిక్‌గా సాగుతుంద‌ని, సెకండాఫ్‌లో త‌న‌కు మాధ‌వ‌న్‌కూ మ‌ధ్య సీరియ‌స్ స‌న్నివేశాలు ఉంటాయ‌ని ఆయ‌న చెప్పుకొచ్చాడు. అయితే.. ఈ సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్‌తో అంచ‌నాలు పెరిగాయి. ఇక్క‌డ మ‌రో ఆస‌క్తిర‌మైన అంశం ఏమిటంటే.. చైతూ ఎడ‌మ చేయి.. త‌నకు తెలియ‌కుండానే క‌ద‌ల‌డం. అయితే.. ఈ సినిమా ప్రీమియ‌ర్ షో టాక్ ఎలా ఉందో చూద్దాం.

1541075354_naga-chaitanyas-savyasachi

స‌వ్య‌సాచి క‌థ మ‌రీ కొత్త‌దేం కాదుగానీ.. న‌డిపించిన తీరు కొంత ఇంట్రెస్టింగ్ ఉంది. సినిమా మొద‌లు కాగానే.. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని కులు వ్యాలీ సీన్ క‌నిపిస్తుంది. ఇక్క‌డే నాగ చైత‌న్య సిస్ట‌ర్ భూమిక వ‌ద్ద ఉంటాడు. ఇక యాడ్ ఫిల్మ్ మేక‌ర్‌గా చైతూ క‌నిపిస్తాడు. ఇక చైతూ, నిధి అగ‌ర్వాల్ మ‌ధ్య న‌డిచే ల‌వ్ స‌న్నివేశాలు కాస్త బోరింగ్‌గానే క‌నిపిస్తాయి. అయితే.. ఫ‌స్టాఫ్‌లో వ‌చ్చే రెండు పాట‌లు మాత్రం బాగున్నాయ‌నే టాక్ వినిపిస్తోంది. ఇక ఇంట‌ర్వెల్ స‌మ‌యంలో ఒక్క‌సారిగా క‌థ మ‌లుపు తిరుగుతుంది. ఇది ఫ‌స్టాఫ్‌లో మొత్తంగా ఆక‌ట్టుకునే సీన్ అనే చెపొచ్చు. మిస్సింగ్ అయిన మేన కోడ‌లి కోసం నాగ చైత‌న్య వెత‌క‌డంతో సెకండాఫ్ మొద‌ల‌వుతుంది.

ఇక్క‌డి నుంచే మాధ‌వ‌న్ కూడా క‌నిపిస్తాడు. చైతూ, మాధ‌వ‌న్ మాధ్య జ‌రిగే మైండ్ గేమ్ పెద్ద‌గా ఆక‌ట్టుకోలేద‌నే చెప్పొచ్చు. ఇక ఇదే స‌మ‌యంలో వారిద్ద‌రి న‌ట‌న మాత్రం బాగుంది. పాత్ర‌ల‌కు వారిద్ద‌రూ న్యాయం చేశారు. అయితే.. సినిమా ఎండింగ్‌కు ముందు వ‌చ్చే స‌న్నివేశాలు మాత్రం బాగా కుదిరాయి. ఇక చైతూ కెరీర్‌లో మొద‌టి సారిగా త‌న తండ్రి నాగార్జున పాటను రిమేక్ చేశాడు. ఈ పాట‌కు మంచి మార్కులే వేయొచ్చు. కీర‌వాణి అందించిన సంగీతానికి తిరుగులేదు. మొత్తంగా కోడ‌లిని క‌నిపెట్ట‌డంతో సినిమా ఎండ్ అవుతుంది. భూమిక కూతురు ఎందుకు మిస్ అయింది..? మాధ‌వ‌న్‌కు ఉన్న రిలేష‌న్ ఏమిటి..? చైతూ, మాధ‌వ‌న్ మాధ్య న‌డిచిన మైండ్‌గేమ్ ఏమిటో తెలుసుకోవాలంటే తెర‌పై చూడాల్సిందే మ‌రి.

చివ‌రిగా..: స‌వ్య‌సాచిపై ఓ లుక్కేయొచ్చు!

‘సవ్యసాచి’ ప్రీమియర్ షో టాక్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share