‘శైలజారెడ్డి అల్లుడు’ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయింది!

September 11, 2018 at 10:14 am

అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని నాగ చైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చి పది సంవత్సరాలు తాటుతుంది. ఈ మద్య మనోడికి ఒక్కో సక్సెస్ కలిసి వస్తుంది. నాగ చైతన్య, అనూ ఇమాన్యుయేల్ జంటగా నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ సెన్సార్ పూర్తి చేసుకుంది. మారుతీ ,నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం. ‘శైలజారెడ్డి అల్లుడు’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈనెల 13న విడుదలకు సిద్దమవుతుంది.

ఇక ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయే రేంజ్ లో జరిగిందని సమాచారం. ఈ చిత్రానికి ఎలాంటి కత్తిరింపులు లేకుండా సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారి చేసిందని ఈ చిత్ర దర్శకుడు మారుతి తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేశారు. గోపి సుందర్ సంగీతమందించిన అందించారు. ఇక అత్త పాత్రలో రమ్యకృష్ణ నటిస్తుంది.

మరో మూడు రోజుల్లో వెండితెరపై సందడి చేయబోతున్న శైలజారెడ్డి అల్లుడు హీరో నాగ చైతన్యకు మాస్ హీరోగా కొత్త ఇమేజ్ తీసుకొస్తుందని అభిమానులు చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటిదాకా మాస్ సినిమాల పరంగా బలమైన ముద్ర వేయలేకపోయిన చైతు దీంతో అది సాధిస్తాడనే నమ్మకంతో ట్రేడ్ కూడా బాగానే పెట్టుబడులు పెట్టింది. కేవలం థియేట్రికల్ రైట్స్ మాత్రమే పాతిక కోట్ల దాకా సితార సంస్థ అమ్మేసినట్టుగా సమాచారం.

నైజామ్ – 6 కోట్ల 50 లక్షలు

సీడెడ్ – 3 కోట్ల 25 లక్షలు

ఉత్తరాంధ్ర – 2 కోట్ల 40 లక్షలు

ఈస్ట్ గోదావరి – 1 కోటి 55 లక్షలు

వెస్ట్ గోదావరి – 1 కోటి 30 లక్షలు

కృష్ణా – 1 కోటి 45 లక్షలు

గుంటూరు – 1 కోటి 75 లక్షలు

నెల్లూరు – 80 లక్షలు

తెలుగు రాష్ట్రాలు కలిపి – 19 కోట్లు

రెస్ట్ అఫ్ ఇండియా – 2 కోట్ల 20 లక్షలు

ఓవర్ సీస్ – 3 కోట్ల 50 లక్షలు

ప్రపంచవ్యాప్త బిజినెస్ – 24 కోట్ల 70 లక్షలు (అంచనా)

‘శైలజారెడ్డి అల్లుడు’ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయింది!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share