ఇవీ శైల‌జారెడ్డి అల్లుడు వ‌సూళ్లు…

September 16, 2018 at 12:40 pm

విడుద‌ల అయిన మొదటి రోజు మొద‌టి ఆట నుంచి మాంచి టాక్ రావ‌డంతో ఈ సినిమా మంచి వ‌సూళ్లు రాబ‌డుతోంది. నాగ‌చైత‌న్య‌, అను ఇమ్మానుయేల్ జంట‌గా… ర‌మ్య‌క‌`ష్ణ కీల‌క పాత్ర పోషించిన ఈ సినిమా విజ‌యంతంగా న‌డుస్తోంది. తెలుగు తెర‌పై అత్తాఅల్లుళ్ల పోరుకు ఎప్ప‌టికీ ఆద‌ర‌ణ త‌గ్గ‌ద‌ని మ‌రోసారి రుజువు అయింది. నిజానికి.. ఇందులో గ‌త సినిమాల‌కు కొంత భిన్నంగానే అల్లుడి పాత్ర‌ను తీర్చిదిద్దారు. అహంతో ఊగిపోయే అత్త‌గా ర‌మ్య‌క‌`ష్ణ‌, డ‌బ్బు.. పొగరున్న అమ్మాయిగా అను, సాఫ్ట్ కార్న‌ర్ అబ్బాయిగా చైతూను చూసి ప్రేక్ష‌కులు మురిసిపోతున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు ఓవ‌ర్సీస్ కొంత భిన్న‌మైన టాక్ వ‌చ్చినా.. తెలుగు ప్రేక్ష‌కులు మాత్రం త‌మ‌కు పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చింద‌ని అంటున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న వినాయకచవితి పర్వదినాన విడుద‌లైన విష‌యం తెలిసిందే. విడుద‌లైన అన్ని సెంట‌ర్ల‌లోనూ మంచి వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది. మొదటి షో తోనే సక్సెస్ టాక్ తెచ్చుకోవటంతో భారీ కలెక్షన్స్ దిశగా వెళ్తోంద‌ని చిత్ర యూనిట్ ఆనందం వ్య‌క్తం చేస్తోంది. అయితే.. తొలి మూడు రోజుల్లోనే ఈ సినిమా 23 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్ట‌డంతో చిత్ర‌యూనిట్ సంబురాలు చేసుకుంటోంది. ఈ మేరకు కొత్త పోస్టర్ విడుదల చేశారు.

అయితే.. అక్కినేని అభిమానులు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. ఒకే రోజు చైతూ, సామ్ సినిమాలు శైల‌జారెడ్డి అల్లుడు, యూట‌ర్న్‌ విడుద‌ల కావ‌డం.. మాంచి టాక్ తెచ్చుకోవ‌డం.. భారీ వ‌సూళ్ల దిశ‌గా అడుగులు వేస్తుండ‌డంతో ఆనందంలో మునిగితేలుతున్నారు. సామ్ కీ రోల్ పోషించిన యూట‌ర్న్ కూడా స‌క్సెస్ దిశ‌గా దూసుకెళ్తోంది. అయితే.. శైల‌జారెడ్డి అల్లుడు చిత్రం అనూహ్య విజయం సాధించడంతో చిత్ర యూనిట్ బ్లాక్‌బస్టర్ వేడుకను ఘ‌నంగా నిర్వహించిన విష‌యం తెలిసిందే.

ఇవీ శైల‌జారెడ్డి అల్లుడు వ‌సూళ్లు…
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share