
జబర్ధస్త్ కామెడీ షో తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న షకలక శంకర్ తర్వాత వెండితెరపై కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చాడు. అదృష్టం కలిసి వచ్చి వరుసగా సినిమా ఛాన్సులు దక్కించుకున్నాడు. ఈ మద్య కమెడియన్లు హీరోలుగా మారుతున్న తరుణంలో షకలక శంకర్ కూడా ‘శంభో శంకర’ సినిమాతో హీరోగా మారారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ సమయంలో ఎన్నో సంచలనాలు సృష్టించారు..ఒక కార్యక్రమంలో త్రివిక్రమ్, దిల్ రాజు, రవితేజపై కూడా తనదైన స్టైల్ల కామెంట్ చేశాడు.
దాంతో ఇండస్ట్రీలో అదో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఆ మద్య పవన్ కళ్యాన్ సెట్స్ లో షకలక శంకర్ ని తిట్టినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షకల శంకర్ మాట్లాడుతూ..అసలు ఆ సినిమాలో యాక్ట్ చేయడానికి వెళ్లలేదు. ఆ సినిమా దర్శకుడితో పనిలేదు. కేవలం కల్యాణ్బాబుగారిని చూడటానికే ఆ సినిమా షూటింగ్కు వెళ్లా. ఏ సీన్ చెబుతున్నారో నాకు తెలియదు.. ఎలా యాక్ట్ చేయాలో కూడా నాకు తెలియదు. నాకు డైలాగ్లు కూడా సరిగ్గా గుర్తుండేవి కావు. పవన్ కళ్యాన్ ని తనివితీరా చూసేవాడిని అని అన్నారు. 75రోజుల పాటు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకూ ఆయన్ని ఎంత చూసినా తనివి తీరేది కాదు.
ఇదిలా ఉంటే..ఉదయం నుంచి సాయంత్రం వరకూ పవన్ ని అలా చూస్తూ ఉండేవాడిని .. అయినా తనివి తీరేది కాదు. ఆ సినిమాకి తీసిన సీనే మళ్లీ మళ్లీ తీస్తుండేవాళ్లు..దాంతో నాకు చిర్రెత్తుకొచ్చి కో డైరెక్టర్ పై అరిచాను. ఈ విషయం కాస్త పవన్ కళ్యాన్ వద్దకు వెళ్లింది..దాంతో ఆయన నన్ను పిలిచి..’ఏరా అప్పుడే డైరెక్టర్ ను .. కో డైరెక్టర్ ను అనే రేంజ్ కి వచ్చేశావురా నువ్వు .. వాళ్లు ఎన్నిసార్లు తీస్తే నీకెందుకు .. నీకు అవసరమా? నీ హద్దుల్లో నువ్వుండు .. పనిచేసుకుని పో .. అర్థమైందా .. పో’ అన్నారు. ఆ రోజున జరిగింది ఇదే’ అంటూ స్పష్టం చేశాడు.