‘ గృహం ‘ ఫ‌స్ట్ షో టాక్‌… హిట్టా… ఫ‌ట్టా

ఇటీవ‌ల సౌత్‌లో హ‌ర్ర‌ర్‌, కామెడీ జాన‌ర్ మిక్స్ చేసుకుని సినిమాలు రావ‌డం కామ‌న్ అయిపోయింది. ప‌దే ప‌దే ఈ జాన‌ర్‌లో సినిమాలు రావ‌డంతో ప్రేక్ష‌కులకు కూడా చికాకు వ‌చ్చేసింది. ఇటీవ‌ల వ‌స్తోన్న సినిమాలు ఒకే క‌థ‌, క‌థ‌నాల‌తో ఉండి బోర్ కొట్టించేయ‌డంతో ప్రేక్ష‌కులు ఈ జాన‌ర్ సినిమాల‌ను పెద్దగా ప‌ట్టించుకోవ‌డం లేదు. తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు ల‌వ‌ర్‌బాయ్ ఇమేజ్‌తో బాగా ద‌గ్గ‌రైన సిద్ధార్థ్ గ‌త కొద్ది రోజులుగా స‌రైన హిట్ లేక వ‌రుస ప‌రాజ‌యాల‌తో కొట్టుమిట్టాడుతున్నాడు.

తాజాగా ఇదే జాన‌ర్‌లో సిద్ధార్థ్ చేసిన సినిమా గృహం. సిద్ధార్థ్ స‌ర‌స‌న ఆండ్రియా హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాను సిద్ధార్థ్ స్వ‌యంగా నిర్మించాడు. తమిళ్‌లో గ‌త వారం రిలీజ్ అయిన ఈ సినిమా మంచి హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. తెలుగులో వారం లేట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా ఈ రోజు థియేట‌ర్ల‌లోకి దిగుతోంది. ప్రివ్యూలు, ఫ‌స్ట్ షో టాక్ త‌ర్వాత ఈ సినిమాకు తెలుగులో ఎలాంటి టాక్ ? వ‌చ్చిందో చూద్దాం.

ఓ ఇంట్లో ఉండే ఫ్యామిలీలో ఓ వ్య‌క్తికి ఇంట్లో ఉన్న దెయ్యం ఆవ‌హించ‌డం అనే కాన్సెఫ్ట్‌తోనే గృహం తెర‌కెక్కింది. ఆమె వింత ప్ర‌వ‌ర్త‌న‌, కేక‌ల‌తో ఆ ఇంట్లో ఉన్న‌వాళ్లంతా భ‌య‌ప‌డుతుంటారు. మ‌నం ఈ లైన్ చాలా సినిమాల్లో చూసేశాం. అయితే ఈ సినిమాలో ఒకే ఇంట్లో మూడు దెయ్యాల‌ను ఉంచ‌డంతో పాటు సెకండాఫ్‌లో అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వ‌డం, బాగా భ‌య‌పెట్ట‌డంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అయ్యాడు. ఈ మూడు దెయ్యాల నుంచి ఆత్మ ఆవ‌హించిన జెన్నీని హీరో ఎలా కాపాడుకున్నాడ‌న్న‌దే మెయిన్ స్టోరీ.

ఇంట‌ర్వెల్‌, క్లైమాక్స్ సీన్ల‌లో ప్రేక్ష‌కుడు బాగా భ‌య‌ప‌డ‌తాడు. సిద్ధూ – ఆండ్రియా మ‌ధ్య రొమాంటిక్ బెడ్ రూం సీన్లు, లిప్‌కిస్‌లు బాగున్నాయి. సిద్ధార్థ్ ఈ జాన‌ర్‌లో చేసిన ఈ సినిమాలో బాగా ఆక‌ట్టుకున్నాడు. జెన్నీగా చేసిన న‌టి బాగా న‌టించింది. ఆర్ఆర్ సూప‌ర్‌. డైలాగ్స్ పేలాయి. ఇలాంటి జాన‌ర్‌లో పాత క‌థ‌కే కొత్త క‌ల‌రింగ్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు సినిమాను ప్రేక్ష‌కుడికి బాగా క‌నెక్ట్ చేశాడు. సిద్ధార్థ్‌కు చాలా రోజుల త‌ర్వాత మంచి సినిమా.