” సింగం-3 ” ఫస్ట్ డే తెలుగు+తమిళ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

February 11, 2017 at 8:21 am
11_IMG_new

కోలీవుడ్ హీరో సూర్య నటించిన సింగం సీక్వెల్ ఎస్ 3 ఈ గురువారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2వేల థియేట‌ర్ల‌లో భారీగా రిలీజ్ అయ్యింది. సింగం సీరిస్‌లో ఇంత‌కు ముందు వ‌చ్చిన య‌ముడు – సింగం సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో మూడో సినిమా సింగం-3 పై రిలీజ్‌కు ముందే భారీ అంచ‌నాలు ఉన్నాయి.

ఎన్నోసార్లు వాయిదా ప‌డిన ఈ సినిమా ఎట్ట‌కేల‌కు గురువారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. దస‌రా – దీపావ‌ళి – డిసెంబ‌ర్ 16, డిసెంబ‌ర్ 23, జ‌న‌వ‌రి 26 ఇలా పలుసార్లు వాయిదాల మీద వాయిదాలు ప‌డ‌డంతో సినిమాకు స్టార్టింగ్‌లో ఉన్న హైప్‌తో పోల్చుకుంటే కాస్త క్రేజ్ త‌గ్గింది.

ఇక ఈ సినిమా తొలి రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో మంచి ప్రారంభ వ‌సూళ్లు ద‌క్కించుకుంది. ఏపీ, తెలంగాణ‌లో తొలి రోజు 4.8 కోట్ల గ్రాస్.. 3.39 కోట్ల షేర్ దక్కించుకుంది. నైజాంలో 1.15 కోట్లు – సీడెడ్‌లో 70 ల‌క్ష‌లు –  ఉత్తరాంధ్రలో 40 లక్షలు – గంటూరు 33 లక్షలు – కృష్ణా 21 లక్షలు – ఈస్ట్ 23 లక్షలు – వెస్ట్ 21 లక్షలు – నెల్లూరు 16 లక్షల వసూళ్లు దక్కాయి. తెలుగు వెర్షన్ వరకు చూసుకుంటే మంచి ఓపెనింగ్స్ అనే చెప్పాలి.

ఇక వ‌ర‌ల్డ్ వైడ్‌గా తెలుగు + త‌మిళ్ క‌లుపుకుంటే రూ 17.6 కోట్ల గ్రాస్ రాబ‌ట్టింది. తమిళనాడులో 9 కోట్ల గ్రాస్ – ఏపీ నైజాంలో కలిపి 4.8 కోట్లు –  కేరళ 1.8 కోట్లు – కర్నాటకలో 1 కోటి – రెస్టాఫ్ ఇండియా 0.4 కోట్లు రాబట్టింది. తొలి రెండు పార్టులు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డం…ఈ సినిమాపై ఉన్న అంచ‌నాల నేప‌థ్యంలో ఈ సినిమాకు జ‌రిగిన బిజినెస్‌తో పోల్చుకుంటే ఈ వ‌సూళ్లు కాస్త త‌క్కువే అన్న టాక్ వ‌స్తోంది.

” సింగం-3 ” ఫస్ట్ డే తెలుగు+తమిళ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share