హీరోయిన్ భావ‌న కిడ్నాప్ వెన‌క స్టార్ హీరో..!

February 21, 2017 at 5:30 am
actress-Bhavana

మలయాళ హీరోయిన్ భావన కిడ్నాప్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తెలుగులో ఒంట‌రి – విక్ట‌రీ – మ‌హాత్మ వంటి సినిమాల‌తో ఇక్క‌డి ప్రేక్ష‌కుల‌కు కూడా ప‌రిచ‌య‌మైన భావ‌నపై రెండు రోజుల క్రితం కారులో గంట‌న్న‌ర పాటు లైంగీక దాడి జ‌రిగిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. షూటింగ్ ముగించుకుని వ‌స్తోన్న ఆమెను కొంత‌మంది కారులో ఎక్కించుకుని గంట‌న్న‌ర పాటు కారులోనే ఆమెపై లైంగీక దాడి చేశార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

ఈ కేసును చాలా స్పీడ్‌గా విచారించిన పోలీసులు ముందుగా మాజీ డ్రైవ‌ర్‌నే అనుమానించారు. త‌ర్వాత ఇది ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం జ‌రిగిన కిడ్నాప్ కేసు అని భావించారు. ఇక ఇప్పుడు ఈ సంఘ‌ట‌న వెన‌క ఓ యంగ్ హీరో హ‌స్తం ఉన్న‌ట్టు కూడా పోలీసుల విచారణలో వెల్లడవడం గమనార్హం.

భావ‌న కిడ్నాప్ వ్య‌వ‌హారం కేర‌ళ‌ను ఓ కుదుపు కుదిపేసింది. దీనిపై భారీ ఎత్తున విమ‌ర్శ‌లు రావ‌డంతో చివ‌ర‌కు సీఎం సైతం కేసు స్పీడ్‌గా జ‌ర‌గాల‌ని చెప్పాల్సి వ‌చ్చింది. ఇక కిడ్నాప్ వ్య‌వ‌హారంలో కీల‌కంగా ఉన్న సునీల్‌కుమార్ అనే వ్య‌క్తికి ఓ హీరో రూ.30 ల‌క్ష‌లు కూడా ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

భావ‌న కిడ్నాప్ వ్య‌వ‌హారాన్ని ప్లాన్ చేసిన స‌ద‌రు హీరో ఒక‌ప్పుడు భావ‌న‌కు మంచి ఫ్రెండేన‌ట‌. వారిద్ద‌రు ప్రేమించి పెళ్లి చేసుకునే వ‌ర‌కు వెళ్లార‌ట‌. ఆ హీరో భార్య నుంచి విడిపోయేందుకు కూడా భావ‌నే అన్న‌ట్టు కూడా రూమ‌ర్లు వినిపిస్తున్నాయి. త‌ర్వాత వారిద్ద‌రి మ‌ధ్య విబేధాలు రావ‌డంతో వారిద్ద‌రు విడిపోయార‌ని తెలుస్తోంది.

చివ‌ర‌కు ఈ వ్య‌వ‌హారం బాగా ముదిరి ఆ హీరో భావ‌న‌ను కిడ్నాప్ చేసి ఏదో చేసే వ‌ర‌కు వెళ్లింది. ప్ర‌స్తుతం పోలీసులు ఆ హీరోతో పాటు ఈ కిడ్నాప్ వ్య‌వ‌హారంలో ప్ర‌మేయం ఉన్న వారంద‌రిని అరెస్టు చేసి మీడియా ముందు ప్ర‌వేశ‌పెట్టే ప‌నిలో బిజీగా ఉన్నారు.

హీరోయిన్ భావ‌న కిడ్నాప్ వెన‌క స్టార్ హీరో..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share