కామెడీ, ఎమోషన్ తో ‘నన్ను దోచుకుందువటే’అదరగొట్టిన ట్రైలర్!

September 10, 2018 at 6:28 pm
dweew

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మహేష్ బాబు హీరోగా నెంబర్ వన్ పొజీషన్ లో ఉన్నాడు. కృష్ణ చిన్న అల్లుడు సదీర్ బాబు ‘ఎస్ ఎం ఎస్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పెద్దగా విజయాలు మాత్రం తక్కించుకోలేక పోయాడు. ఆప్పట్లో ప్రేమ కథా చిత్రమ్ తర్వాత ఈ మద్య రిలీజ్ అయిన సమ్మోహనం సినిమాతో మరో అద్భుతమైన విజయం అందుకున్నాడు.

ఇప్పుడు కొత్త దర్శకులు మంచి కాన్సెప్ట్ తో సినిమాలు తీస్తున్నారు. యూత్ ఫుల్ క్యారెక్టర్లు, యూత్ ఫుల్ స్టోరీ, యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకులను రంజింప చేస్తున్నారు. ఇదే ఇప్పుడు టాలీవుడ్ తారకమంత్రంగా మారింది. నిర్మాతగా మారిన హీరో సుధీర్ బాబు కూడా పక్కాగా ఈ కానెప్ట్ తోనే సినిమా నిర్మించినట్లు కనిపిస్తోంది. తాజా చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ సోమవారం నాడు బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాప్ చేతులు మీదుగా విడుదలైంది.

సాఫ్ట్ వేర్ కంపెనీకి మేనేజర్‌గా స్టాఫ్ మొత్తాన్ని సీరియస్‌ లుక్స్‌తో బెదరగొడుతున్నాడు. ఇక అదే ఆఫీస్‌లో అల్లరి పిల్లగా నభా నటేష్ సందడి చేస్తుంది. అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నఈ చిత్రం సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా ట్రైలర్‌పై ఓ లుక్కేయండి.

ఆర్ఎస్ నాయుడు డైరెక్షన్‌లో నన్ను దోచుకుందువటే సినిమా తెరకెక్కుతోంది. నాజర్, తులసి ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ద్వారా నాయుడు డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌తో బిజీగా ఉంది. హీరో హీరోయిన్లను ఇటు ఫన్ కు అటు ఎమోషన్ కు కలిపి వాడినట్లు కనిపిస్తోంది. పక్కా ఈ జనరేషన్ కుర్రాళ్ల లైఫ్ ల్లోంచి కథను తెచ్చుకు వచ్చినట్లు కనిపిస్తోంది.

కామెడీ, ఎమోషన్ తో ‘నన్ను దోచుకుందువటే’అదరగొట్టిన ట్రైలర్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share