యంగ్ టైగర్ నుంచి రవితేజకు షిఫ్ట్..మరేం చేస్తాడో!

November 5, 2018 at 1:11 pm

టాలీవుడ్ లో ప్రముఖ కమెడియన్ సునీల్ కెరీర్ గురించి చెప్పుకోవాలంటే గతమెంతో ఘనం వర్తమానం శూన్యం..కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి కేవలం సంవత్సరం కాలంలోనే టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ అందరికీ చెమటలు పట్టించిన సునీల్, ఒకానొక టైంలో స్టార్ హీరోలని సైతం క్రాస్ చేసి పీక్ స్టేజ్కు వెళ్ళిపోయాడు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం కెరీర్ స్టార్ట్ చేసిన సునీల్ అప్పట్లో వరుస హిట్లతో ఒకానొక టైంలో స్టార్ హీరో లను మించిన క్రేజ్ సొంతం చేసుకున్నాడు.

1541386557-196

అలాంటి సునీల్ ఎప్పుడైతే హీరోగా ఎంట్రీ ఇచ్చి మూడు నాలుగు హిట్లు ఇచ్చాడో, అక్కడితోనే సునీల్ కెరియర్ అంతమైపోయింది. హీరోగా స్టార్టింగ్ లో మంచి హిట్లు ఇచ్చిన సునీల్ ఆ తర్వాత నాసిరకమైన కథలు ఎంచుకుని ఏకంగా ఫ్లాపుల మీద ఫ్లాపులు ఇచ్చాడు. ఒకప్పుడు సునీల్ కమెడియన్ గా చేస్తున్నాడు అంటేనే థియేటర్లకు క్యూ కట్టే ప్రేక్షకులు చివరకు హీరోగా సునీల్ సినిమా వస్తుందంటే నే గుర్తుంచుకునే పరిస్థితి లేకుండా పోయింది. సునీల్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది ప్లాపులు ఇచ్చాడు, మనోడు మార్కెట్ ఘోరంగా పతనమైంది వరుస ప్లాపులు ఇస్తున్న సునీల్ మాత్రం హీరో గానే తానేంటో ప్రూవ్ చేసుకోవాలని చాల కష్టపడ్డాడు.

చివరకు మనోడు కమెడియన్ గా రీ ఎంట్రీ ఇచ్చినా అరవింద సమేత లో సునీల్ కు ఏమాత్రం పేరు రాలేదు, ఇప్పుడు తాజాగా రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో వస్తున్న అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు సైతం సునీల్ కమెడియన్ రోల్ చేస్తున్నాడు. గతంలో రవితేజ సునీల్ శ్రీనువైట్ల కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో సునీల్ కామెడీ రోల్ చేసేవాడు ఆ సినిమాల్లో కామెడీ బాగా పేలింది. ఇక తాజా సినిమాలో సైతం సునీల్ ది సినిమా అంతా ఉండే ఫుల్ లెంత్ కామెడీ రోల్ అని తెలుస్తోంది, శ్రీను వైట్ల సినిమా అంటేనే కామెడీ కి ఎంత స్కోప్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మరి ఇప్పుడు తన తాజా సినిమా లో సునీల్ కామెడీ ని ఎలా పేలుస్తాడో హీరో నుంచి కమెడియన్గా పడిపోయిన సునీల్ కు ఈ సినిమాతో రవితేజ శ్రీను వైట్ల ఆక్సిజన్ అందిస్తారా లేదా అన్నది చూడాలి.

యంగ్ టైగర్ నుంచి రవితేజకు షిఫ్ట్..మరేం చేస్తాడో!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share