సైరానా.. మ‌జాకా..! ఆ సీన్‌కే రూ.45కోట్లు

September 16, 2018 at 11:48 am

మెగాస్టార్ చిరంజీవి సినిమా షూటింగ్ నుంచే హైప్ క్రియేట్ చేస్తోంది. చిరు పేరు వింటేనే అభిమానుల క‌న్నుల‌నిండా పండుగ క‌నిపిస్తోంది. ఇప్పుడు ఆయ‌న న‌టిస్తున్న భారీ బ‌డ్జెట్ చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా ఇండ‌స్ట్రీలో హీట్ పుట్టిస్తోంది. ఆ సినిమాకు సంబంధించిన అంశాలు మ‌రిన్ని అంచ‌నాలు పెంచుతున్నాయి. భారతీయ సినిమా చ‌రిత్ర‌లోనే క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో యుద్ధ స‌న్నివేశాలు ఉంటున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్‌తో ఈ విష‌యం స్ప‌ష్ట‌మైంది. ఇందులో చిరు గెట‌ప్ అదుర్స్‌. చారిత్ర‌క క‌థా నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో యుద్ధ స‌న్నివేశాలు ఒళ్లు గ‌గుర్పొడిచేలా ఉంటాయ‌నే టాక్ వినిపిస్తోంది.

dc-Cover-sbumi5gfqhgcm08vvlipq8cdp6-20180821205608.Medi

ఆ మేర‌కు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి బ‌`ందం కూడా అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తోంది. అయితే.. మీరు తెలుసుకోవాల్సిన విష‌యం ఏమిటంటే.. ఆ ఒక్క యుద్ధ స‌న్నివేశాన్ని తెర‌కెక్కించేందుకు పెడుతున్న ఖ‌ర్చు రూ.45 నుంచి 50కోట్లు. బాబోయ్‌.. ఇంత భారీ మొత్తంలో ఆ ఒక్క యుద్ధ స‌న్నివేశానికి వెచ్చిస్తున్నారా..? అని నోరెళ్ల‌బెట్ట‌కండి. ఎందుకంటే.. ఈ సినిమాలో వ‌చ్చే ప్ర‌తీ సీన్ కోసం కోట్ల‌కు కోట్లు వెచ్చిస్తున్నార‌ట. రాజీ అన్నదే లేకుండా కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ అధినేత రామ్ చరణ్ బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నారు. నాన్న కళ్లలో ఆనందం చూసేవారకూ ఎంత బడ్జెట్ అయినా పెడుతామని టైటిల్ లాంచ్ వేడుకలో చరణ్ బహిరంగంగానే చెప్పిన విష‌యం తెలిసిందే. అమ్మానాన్న‌కు ఇస్తున్న కానుక ఇది అంటూ ఆయ‌న ఉద్వేగంతో అన్న మాట‌ల్ని అభిమానులు మ‌రిచిపోగ‌ల‌రా..!

అయితే.. ఈ యుద్ధ స‌న్నివేశాన్ని జార్జియాలో తెర‌కెక్కిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా సురేంద‌ర్‌రెడ్డి బ‌`ందం క‌ష్ట‌ప‌డుతోంద‌ట‌. జార్జియాలో అప్ప‌టికే రెడీగా ఉన్నవార్ సెట‌ప్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంద‌ట‌. ఇక్క‌డ మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. నంద‌మూరి బాల‌క‌`ష్ణ హీరోగా.. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలోని యుద్ధ స‌న్నివేశాల‌ను ఇక్క‌డే చిత్రీక‌రించారు. మ‌రి ఇంత‌మంది సైనికులను ఎక్క‌డి నుంచి తెస్తార‌నే క‌దా మీ డౌటు.. అయితే అక్కడ స్థానికంగా ఉన్న‌ వేలాది మంది జూనియ‌ర్‌.ఆర్టిస్టుల్ని సైనికులుగా ఉప‌యోగిస్తున్నార‌ట‌. ఇక్క‌డ చిత్రీక‌ర‌ణ పూర్తి అయిన త‌ర్వాత వీఎఫ్ఎక్స్‌తో మిక్స్ చేస్తారు. ఇక ఈ సినిమా చిత్రీక‌ర‌ణ డిసెంబ‌ర్‌లో పూర్తి చేసి.. వ‌చ్చే వేస‌విలో విడుద‌ల చేస్తార‌నే టాక్ వినిపిస్తోంది.

సైరానా.. మ‌జాకా..! ఆ సీన్‌కే రూ.45కోట్లు
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share