సైరా మోష‌న్ టీజ‌ర్.. న‌య‌న్ లుక్ అదిరింది

November 18, 2018 at 2:51 pm

సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. ఈ సినిమా అటు ద‌ర్శ‌కుడు స‌రేంద‌ర్‌రెడ్డికి, ఇటు చిరంజీవికి అత్యంత ప్రతిష్టాత్మ‌క‌మైన ప్రాజెక్టు. ఇక‌ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే.. అయితే.. ఆదివారం హీరోయిన్‌ నయనతార పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రబృందం ఆమెకు విషెస్ చెబుతూ.. నయన్ ఫస్ట్‌లుక్‌కు సంబంధించిన మోషన్ టీజర్‌ను విడుదల చేసింది.

nayanthara-759

‘వెరీ వెరీ హ్యాపీ బర్త్ డే నయనతార. ఈ సందర్భంగా ‘సైరా నరసింహారెడ్డి’ నుంచి సిద్ధమ్మ అద్భుతమైన లుక్’ అని ట్వీట్ చేసింది యూనిట్‌. నిజానికి న‌య‌న‌తార ఫ‌స్ట్‌లుక్ అదిరింది అంటూ కామెంట్స్ వ‌స్తున్నాయి. ఇక‌ ఈ చిత్రంలో నయన్ పాత్ర పేరు సిద్ధమ్మ. ఈ సినిమాలో చిరు ద్విపాత్రాభినం పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మరణానంతరం ఆయన స్ఫూర్తితో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటాన్ని కొనసాగిస్తాడు. ఈ పాత్రను కూడా చిరంజీవితోనే చేయించనున్నట్టు ఇండ‌స్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన అనేక అంశాలు మ‌రింత ఆస‌క్తిని పెంచేస్తున్నాయి. చిరంజీవి 151వ సినిమాగా వ‌స్తున్న సైరా న‌ర‌సింహారెడ్డిలోని ప్ర‌తీ స‌న్నివేశాన్ని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్నారు. ఒక్క‌ఫైట్ సీన్‌కే సుమారు యాభైకోట్లు ఖ‌ర్చు చేస్తుండ‌డం.. తాజాగా ఈ సినిమాలో ఐటెంలాగే కానీ కొంచెం కొత్త‌గా ఓ పాట‌ను రూపొందించాల‌ని, దీనికి సుమారు రూ.8కోట్లు ఖ‌ర్చు చేస్తున్నార‌నే ప్ర‌చారం కూడా జోరందుకుంది. ముందుముందు మ‌రెన్ని విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తాయో చూడాలి మ‌రి.

సైరా మోష‌న్ టీజ‌ర్.. న‌య‌న్ లుక్ అదిరింది
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share