బాహుబలిని మించిన సినిమా మేము తీయగలం

బాహుబలి  ఈ సినిమా ఒక అప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే ఎదురుచూసిన సినిమా . కానీ బాహుబలి ది బిగినింగ్ సినిమా  రిలీజ్ అయిన తరువాత భాషతో  సంబంధం లేకుండా దేశం మొత్తం ప్రాంతీయ చిత్రం అనేభావం చెరిపేసి రికార్డు స్థాయిలో కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఇండియన్ సినిమాలని బాలీవుడ్ మాత్రమే శాసిస్తున్న తరుణంలో తెలుగు సినిమా బాహుబలితో  దేశం మొత్తాన్ని తెలుగు ఇండస్ట్రీ వైపు చూసేలాగా చేసాడు దర్శక ధీరుడు S S   రాజమౌళి . ఒక ప్రాంతీయ చిత్రం ఇంతటి ఘనవిజయం సాధించటం చూసి లోలోపల కుల్లుకొన్న  బయట పడకుండా ఉన్న దర్శకులు  మరియు  హీరోలు ఎందరో .

బాహుబలి 2 గురించి చెప్పాల్సింది ఏముంది ,భారతీయ చలన చిత్రంలో ఖాన్స్  పేరిట ఉన్న అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసుకొంటూపోతూ, అవును నేను అందరికంటే బాహుబలిని ఎవరికీ అందనంత ఎత్తులో కలెక్షన్స్ సునామీతో దూసుకుపోతున్నాడు బాహుబలి 2 . ఇది ఒకప్రాంతీయ చిత్రం కాదు ఇది ఒక భారతీయ చిత్రం అని ప్రపంచానికి చాటిచెప్తున్న వేళ, అందరితో ప్రశంసలు అందుకొంటుంటే , మన బాలీవుడ్ అగ్ర హీరోలు ఖాన్స్ ఇప్పటివరకు బాహుబలి ని అభినందించకపోవడం వాళ్లలో ఉన్న ఈర్ష కి నిదర్శనం. బాహుబలి ని చూసి ఎంతలాగ ఆసూయపడుతున్నారో కోలీవుడ్ డైరెక్టర్ చేరన్ మాటలు చూస్తే తెలుస్తాయి .

‘బాహుబలి2’ని మించిన సినిమాను తమిళంలోనూ తీయాలని, అందుకు తగ్గ పౌరాణిక కథలు ఎన్నో ఉన్నాయంటూ చేరన్‌ ట్వీట్‌ చేశారు. ఇప్పుడిది కోలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ‘బాహుబలి2’ సాధిస్తున్న కలెక్షన్లకు నిర్మాతలు, పంపిణీదారులు యమాఖుషీగా ఉంటే, దర్శకుల్లో మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం బాధాకరం. దర్శిక పటిమతో బలమైన కధ ,సాంకేతిక విలువలతో కూడిన ఒక మంచి సినిమా వస్తే భాషతో సంబంధం లేకుండా అందరూ ఆదరిస్తారు . మరి ఆ కాస్తంత జ్ఞానం లేకుండా కామెంట్స్ చేయడం ఎంత వరకు సబబో ఆ డైరెక్టర్కె తేలియాలీ.