‘అర‌వింద స‌మేత‌’ స్టోరీ ఆ టీడీపీ మంత్రిదే!

October 11, 2018 at 3:19 pm

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమా ఈ రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. ఈ రోజు ఉద‌యం నుంచే రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్సీస్‌లో పెద్ద ఎత్తున షోలు ప‌డ్డాయి. సినిమాకు యునానిమ‌స్‌గా హిట్ టాక్ వ‌చ్చింది. ఓ ఫ్యాక్ష‌న్ సినిమాను త్రివిక్ర‌మ్ ట్రేడ్ మార్క్ టేకింగ్‌,భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఈ సినిమా అంచ‌నాల‌ను అందుకుందా ? ఎన్టీఆర్‌కు వ‌రుస‌గా ఐదో హిట్ ఇచ్చిందా ? ఎన్టీఆర్ విశ్వ‌రూపం చూపించాడా ? త్రివిక్ర‌మ్ మాయాజాలం ప‌నిచేసిందా ? డైలాగ్స్‌తో ఎలా ఉందో చూడాలంటే అర‌వింద స‌మేత చూడాల్సిందే.

An-Emotional-And-Situational-Peniviti-Song-in-Aravindha-Sametha

వీర రాఘవ రెడ్డిగా తారక్ పెర్ఫార్మన్స్ ఆయువుపట్టుగా నిలిచింది. ఇక ఈ సినిమా ఏపీ ప్ర‌స్తుత మంత్రి, అనంత‌పురం జిల్లాకు చెందిన మంత్రి ప‌రిటాల సునీత జీవితానికి కొంత వ‌ర‌కు వ‌ర్తించేలా ఉంద‌న్న అభిప్రాయాన్ని కూడా కొంత‌మంది వ్య‌క్తం చేస్తున్నారు. ఫ్యాక్ష‌న్ ఉచ్చుల్లో చిక్కుకుని జీవితంలో చాలా కోల్పోయి… అయిన వారిని దూరం చేసుకుని… ఆ బాధ‌ను అనుభ‌వించి… దానిని మ‌ర్చిపోయి రాజ‌కీయాల్లో ఎలా రాణిస్తే ఎలా ఉంటుంది… ఈ లైన్‌ను బేస్ చేసుకుని ఓ క‌థ‌ను అల్లుకుని దానిని ఓ మాస్ హీరోతో చెప్పిస్తే ఎలా ఉంటుందో త్రివిక్ర‌మ్ అర‌వింద స‌మేత‌తో చేసి చూపించాడ‌ని కొంద‌రు అంటున్నారు.

సీమ ఫ్యాక్ష‌న్‌లో ప‌రిస్థితుల‌కు ఎదురొడ్డి పోరాటం చేసిన సునీత వ‌రుస‌గా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్నారు. ఇక సినిమాలో హీరో ఇక్క‌డ ఫ్యాక్ష‌న్‌కు చ‌ర‌మ‌గీతం పాడి క్లైమాక్స్‌లో జ‌గ‌ప‌తిబాబ‌ను చంపేసి అత‌డి భార్య రోల్ చేసిన ఈశ్వ‌రీరావుతో నామినేష‌న్ వేయించి… ఎమ్మెల్యే ప‌ద‌విని ఏక‌గ్రీవం చేస్తాడు. అయితే సునీత మాత్రం భ‌ర్త చ‌నిపోతే ఉప ఎన్నిక‌ల్లో గెలిచారు. ఓవ‌రాల్‌గా కాక‌పోయినా సినిమాలో అక్క‌డ‌క్క‌డా కొన్ని చోట్ల సీమ‌లో ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాలు… అక్క‌డ భ‌ర్త‌లు చ‌నిపోతే మ‌హిళ‌లు ఎలాంటి ఇబ్బందులు ప‌డ‌తారు ? ఇలా కొన్ని చోట్ల మాన‌వీయ కోణంలో త్రివిక్ర‌మ్ తీసిన సీన్లు సీమ ఫ్యాక్ష‌న్‌ను గుర్తు చేశాయి.

‘అర‌వింద స‌మేత‌’ స్టోరీ ఆ టీడీపీ మంత్రిదే!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share