
తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా రేయ్ అయినప్పటికీ..దాని తర్వాత సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ నటనకు డ్యాన్స్, ఫైట్స్ కి అభిమానులు ఫిదా అయ్యారు. తర్వాత వచ్చిన సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ మంచి సక్సెస్ సాధించాయి. కానీ తిక్క సినిమా నుంచి ఇంటిలీజెంట్ వరకు ఘోర పరాజయం పొందాయి.
దాంతో ఇప్పుడు సాయిధరమ్ కి సక్సెస్ ఎంతో అవసరంగా ఉంది. తొలిప్రేమ సినిమాతో ఓ బ్రాండ్ సృష్టించిన దర్శకులు కరుణాకరన్ దర్శకత్వంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా ‘తేజ్ ఐ లవ్ యూ’ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ప్రీమియ్ షో టాక్ ప్రకారం..చిన్నప్పుడే ఓ నేరం కేసులో జైలుకు వెళ్లిన సాయిదరమ్ బాలనేరస్తుడిగా జైలు జీవితం గడుపుతాడు. పెద్దయ్యాక ఇంటికి వచ్చిన తేజ్ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతుంటాడు.
ఓ ట్రైన్ లో పరిచయం అయిన హీరోయిన్ అనుపమ ను టీజ్ చేస్తూ తన ఫ్రెండ్స్ తో సరదా సరదాగా గడుపుతుంటాడు. అయితే హీరో హీరోయిన్ల మధ్య కరుణాకరన్ మార్క్ కామెడీ సన్నివేశాలు చూపించాడు. ఫస్టాఫ్ మొత్తం ప్రేమ వ్యవహారంతో..హ్యాపీ హ్యాపీగా గడిచిపోతుంది. ఇంట్రవెల్ తర్వాత ట్విస్ట్ లతో అదరగొట్టాడు దర్శకుడు. హీరోయిన్ , హీరో ప్రేమను రిజక్ట్ చేయడం..కొంత కాలం దూరంగా ఉండటం..తర్వాత హీరోకి ఎలా దగ్గరయ్యింది..తన కుటుంబం కోసం హీరో ఏం చేశాడు అన్న కథా సారంశం ‘తేజ్ ఐ లవ్ యూ’.
నటన పరంగా సాయిధరమ్ మంచి నటన ప్రదర్శించాడు. అనుపమ తన అందాలతో అదరగొట్టింది. సాంగ్స్ కూడా పరవాలేదు..ఇక కెమెరా విషయంలో మంచి మార్కులు కొట్టేశాడు. మొత్తానికి ‘తేజ్ ఐ లవ్ యూ’ ఓ రొమాంటిక్ డ్రామా స్టోరీ అనిపించిందని ప్రేక్షకులు అంటున్నారు.
తెలుగు జర్నలిస్ట్ పూర్తి రివ్యూ కోసం వేచి చూడండి..