‘తేజ్ ఐ లవ్ యు’ టీజర్

May 1, 2018 at 11:51 am
Tej I Love You Teaser, Sai Dharam Tej, Anupama Parameswaran, Karunakaran

మెగా మేన‌ళ్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ – అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జంట‌గా ఏఆర్‌.క‌రుణాక‌ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సినిమా తేజ్ ఐల‌వ్ యూ. క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్ బ్యాన‌ర్‌పై అగ్ర నిర్మాత కెఎస్‌.రామారావు నిర్మిస్తోన్న ఈ సినిమా కంప్లీట్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కుతోంది. మామ‌య్య ప‌వ‌న్‌కు కెరీర్‌లోనే కాకుండా టాలీవుడ్ హిస్ట‌రీలోనే తొలిప్రేమతో మ‌ర్చిపోలేని సినిమా ఇచ్చాడు. తొలిప్రేమ త‌ర్వాత త‌న స్థాయికి త‌గ్గ సినిమా ఇవ్వ‌లేక‌పోయిన క‌రుణాక‌ర‌న్‌, ఇటు ఐదు వ‌రుస ప్లాపుల‌తో ఉన్న సాయి కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న ఈ సినిమా హిట్ కొట్ట‌డం ఇద్ద‌రికి అవ‌స‌రం.

 

సాయి స‌ర‌స‌న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తోన్న ఈ సినిమా టీజ‌ర్లో సాయి బ‌స్టాండ్లో టీ తాగుతూ తొలిప్రేమ మాధుర్యాన్ని ఊహించుకుంటూ ఉంటాడు. టీజ‌ర్ క‌ట్ చేసిన తీరును బ‌ట్టి చూస్తుంటే క‌రుణ‌క‌ర‌న్ మ‌ళ్లీ ప్రేమ‌లోని మాధుర్యంతో ప్రేక్ష‌కుల‌ను బాగా క‌నెక్ట్ చేసే ప్ర‌య‌త్న‌మే చేశాడ‌నిపిస్తోంది. ఈ టీజ‌ర్‌పై మీరు కూడా ఓ లుక్కేయండి.

‘తేజ్ ఐ లవ్ యు’ టీజర్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share