మల్టీఫ్లెక్సు థియేటర్లకు సీఎం కేసీఆర్ షాక్!

July 19, 2018 at 3:08 pm
Telangana, CM, KCR, taking action, on Multiplex theaters

ఒక సామాన్యుడు సినిమా థియేటర్లకు వచ్చి తన కుటుంబంతో ప్రశాంతంగా సినిమా చూసి వెళ్లాలంటే బడ్జెట్ గురించి తెగ భయపడాల్సి వస్తుంది. ఒకప్పుడు ఓ రెండు వందలతో వదిలిపోయేది..ఇప్పుడు మినిమం వెయ్యిరూపాయలకు వచ్చింది. అదూ కుటుంబంలో ఓ నలుగురు ఉంటేనే..ఎక్కువ మంది ఉంటే ఖర్చు ఎక్కువే. ఇక మల్టీఫ్లెక్స్ థియేటర్లో ఆ బాదుడు డబుల్ ఉంటుందని..అటువైపు వెళ్లడమే మానేస్తున్నారు.

Multiplex-food-court

కాకపోతే తమ అభిమాన హీరోలు సినిమాలు ఎక్కువగా మల్టీఫ్లెక్సు థియేటర్లలో రావడంతో చచ్చీ చెడి ఖర్చులు భరిస్తున్నారు. ఇదిలా ఉంటే థియేటర్లో ఏదైనా కొని తినాలన్నా..తాగాలన్న మరో అధనపు ఖర్చులు అవుతున్నాయి. తాజాగా తెలంగాణలో మల్టీఫ్లెక్సులతో పాటు.. థియేటర్లలో సినిమా చూసే ప్రేక్షకులంతా పండగ చేసుకోవాల్సిన సమయమిది. సినిమా టికెట్ రూ.150 అయితే.. పాప్ కార్న్ కు రూ.160 చెల్లించాల్సిన బాదుడుకు చెక్ పెడుతూ తెలంగాణ రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. మై మూవీ.. మై ఫుడ్ పేరుతో మహారాష్ట్రలో నడిచిన ఉద్యమం నేపథ్యంలో.. మల్టీఫ్లెక్సుల్లోకి బయట పుడ్ తీసుకెళ్లేందుకు అనుమతిస్తూ మహారాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది.

KCR-goes-NTR-way-to-invite-national-leaders-620x320

మల్టీఫ్లెక్సుల్లో ఆహారధరలు ఆకాశాన్నిఅంటుతున్న నేపథ్యంలో బయట నుంచి ఆహారాన్ని థియేటర్లకు తీసుకొచ్చేందుకు వీలుగా మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం.. ఆగస్టు 1 నుంచి ప్రేక్షకులు బయట నుంచి ఆహారం తీసుకెళ్లేలా ఉత్తర్వులు జారీ చేసింది.మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిషికేషన్ ను చూసి.. వాటిని పూర్తి స్థాయిలో పరిశీలించి తెలంగాణలోని మల్టీఫ్లెక్సుల్లో ప్రేక్షకులు బయట నుంచి ఆహారం తీసుకెళ్లేలా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లుగా అర్విందరావు ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఆయన ట్వీట్ పై పలువురు ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి తెలంగాణలో కూడా మల్టీఫ్లెక్స్ ల దోపిడికి చెక్ పడబోతున్నందుకు ప్రజలు సంతోషంగా ఉన్నారు.

మల్టీఫ్లెక్సు థియేటర్లకు సీఎం కేసీఆర్ షాక్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share