‘అరవింద సమేత’కు దెబ్బేసిన తిత్లీ!

October 17, 2018 at 11:11 am

అరవింద సమేత..కు ఊహించని దెబ్బ. తిత్లీ తుఫాను రూపంలో ఎదురు దెబ్బ తగిలింది. వసూళ్ల వర్షానికి అడ్డుకట్ట పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర బయ్యర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భారీ నష్టం తప్పదనే ఆందోళన కు గురవుతున్నారు. ఈ సినిమా విడుదల అయి ఆరు రోజులు అవుతున్నా.. సగానికి సగం కూడా రాకపోవడంతో మానసికంగా ఏం జరుగుతుందోనని తలలు పట్టుకుంటున్నారు. నిజానికి.. ఈ సినిమా విడుదల.. తిత్లీ తుఫాను రాక దాదాపుగా ఏక కాలంలో జరిగింది. దీంతో సినిమా వసూళ్ల పై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర లోని శ్రీకాకుళం జిల్లా తిత్లీ తుఫాను ప్రభావంతో అతలాకుతలం అయింది.

_103823095_049898383

ఊళ్లకు ఊళ్లు ఆగమాగం అయ్యాయి. జిల్లాకు కోలుకోలేని నష్టం జరిగింది. కొబ్బరి తోటలు తుడిచిపెట్టుకొని పోయాయి. ఈనేపథ్యంలో అరవింద సమేత.. సినిమా పై తీవ్ర ప్రభావం పడింది. అరవింద సమేత..ను ఉత్తరాంధ్రకు తొమ్మిదిన్నర కోట్ల భారీరేటుకు కొన్నారు. ఇప్పటికీ కలెక్షన్లు సుమారు రూ.5.62 కోట్ల వరకు నమోదు అయ్యాయి. కనీసం ఇంకో రూ.4 కోట్లకు పైగా రావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది అసాధ్యంగానే కనిపిస్తోంది. అయితే.. వర్షాలు ఈ స్థాయిలో ఉత్తరాంధ్రలో లేకుంటే, కనీసం ఇప్పటి వరకు మరో కోటి నుంచి కోటిన్నర యాడ్ అయ్యేదని అంటున్నారు.

అయితే.. వర్షాలు.. కేవలం శ్రీకాకుళం జిల్లాకే పరిమితం అయితే పెద్దగా నష్టం ఉండేది కాదని బయ్యర్లు అంటున్నారు. విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఉత్తరాంధ్ర మొత్తంగా సినిమా వసూళ్లపై ప్రభావం పడిందని అంటున్నారు. ఇదిలా ఉండగా.. అరవిందుడికి కొత్త ఇబ్బందులు వచ్చిపడుతున్నాయి. పెట్టిన ఖర్చు రావడం కష్టమేనని బయ్యర్లు అనుకుంటుంటే.. తిత్లీ బాధితులను ఆదుకోవడానికి ముందుకు రారా..? అని ఇండస్ట్రీపై విమర్శలు వచ్చిపడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ప్రజలు సర్వం కోల్పోయి అల్లాడుతుంటే.. కనీసం స్పందించలేదనే ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఎక్కడెక్కడో బాధితుల కోసం ఆరాటపడుతుంటారు గానీ.. మనవాళ్లను పట్టించుకోరా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

‘అరవింద సమేత’కు దెబ్బేసిన తిత్లీ!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share