చెర్రీ – బ‌న్నీ మ‌ల్టీస్టార‌ర్ టైటిల్ ఫిక్స్‌

టాలీవుడ్‌లో మల్టీస్టారర్లు ఇప్పుడిప్పుడే కాస్త ఊపందుకుంటున్నాయి. స్టార్ హీరోల‌లో విక్ట‌రీ వెంక‌టేష్ ఈ వ‌రుస‌లో అంద‌రికంటే ముందున్నాడు. వెంకీ ఇప్ప‌టికే ప‌వ‌న్‌, మ‌హేష్ లాంటి స్టార్ల‌తో పాటు రామ్ లాంటి యంగ్ హీరోతో కూడా మ‌ల్టీస్టార‌ర్లు చేశాడు. ఇదిలా ఉంటే ఓ క్రికెట్ టీంలా విస్త‌రించి ఉన్న మెగా హీరోలు కూడా మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేయాల‌ని మెగా అభిమానులు ఎప్ప‌టి నుంచో కోరుకుంటున్నారు.

ఈ కోరిక బ‌న్నీ – చెర్రీతో తీర‌నుంద‌ని తెలుస్తోంది. గ‌తంలో ఎవ‌డు సినిమాలో చెర్రీ – బ‌న్నీ క‌లిసి న‌టించినా అందులో బ‌న్నీది గెస్ట్ రోల్ కింద‌కు మాత్ర‌మే వ‌స్తుంది. అయితే ఇప్పుడు వీరిద్ద‌రు క‌లిసి కంప్లీట్‌ మల్టీస్టారర్ తెర‌కెక్కేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంద‌ట‌.

గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఓ భారీ మల్టీస్టారర్ రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఫిల్మ్ నగర్ వర్గాలు బలంగా చెబుతున్నాయి. ఈ మేరకు స్క్రిప్ట్ కూడా రెడీ అయ్యింద‌ని…ఈ సినిమాకు ” చ‌ర‌ణ్ – అర్జున్ ” అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ సినిమా డైరెక్ట‌ర్, ఇత‌ర సాంకేతిక నిపుణుల వివ‌రాల‌తో పాటు ఈ సినిమా ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుంద‌న్నది మాత్రం తేలాల్సి ఉంది.