టాలీవుడ్‌లో వీళ్ల‌కు బ్యాడ్ టైం స్టార్ట్‌

April 26, 2018 at 10:20 am
Tollywood, movie, effect in summer, savyasachi, kala, taksi vala, srinivasa kalyanam

టాలీవుడ్‌లో చిన్న సినిమాల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌న్న చ‌ర్చ‌లు ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. ఎంత మంచి క‌థ‌, క‌థ‌నాల‌తో సినిమాలు వ‌చ్చినా చిన్న సినిమాలు అయితే వాటికి స‌రైన న్యాయం జ‌ర‌గ‌డం లేదు… థియేట‌ర్లు దొర‌క‌వు.. పెద్ద సినిమాలు ఉంటే త‌ప్పుకోవాల్సిందే. ఇక ప్ర‌స్తుతం స‌మ్మ‌ర్‌లో చాలా చిన్ని సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అయితే ఇదే టైంలో వ‌రుస‌గా పెద్ద సినిమాలు ఉండ‌డంతో ఆ సినిమాల‌కు రిలీజ్ డేట్‌, థియేట‌ర్లు దొరికే ప‌రిస్థితి లేదు.

 

సమ్మ‌ర్‌లో త‌మ సినిమాలు రిలీజ్ చేసుకుంటే మంచి వ‌సూళ్లు రాబ‌ట్టుకోవ‌చ్చ‌ని ఎదురు చూస్తోన్న చిన్న సినిమాల నిర్మాత‌ల ఆశ‌ల‌పై వ‌రుస‌గా రిలీజ్ అవుతోన్న పెద్ద సినిమాలు నీళ్లు చ‌ల్లుతున్నాయి. ఇప్ప‌టికే స‌మ్మ‌ర్‌లో చెర్రీ రంగ‌స్థ‌లం వ‌చ్చి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమా ఇప్ప‌ట‌కీ థియేట‌ర్ల‌లో మంచి షేర్‌తో ర‌న్ అవుతోంది. మ‌ధ్య‌లో నాని కృష్ణార్జున యుద్ధం వ‌చ్చి ప్లాప్ అయ్యింది. ఇక ఇప్పుడు మ‌హేష్ భ‌ర‌త్ హంగామా న‌డుస్తోంది. 

 

మే 4న అల్లు అర్జున్ సూర్య వ‌చ్చే వ‌ర‌కు థియేట‌ర్ల‌లో భ‌ర‌త్ ర‌న్ అవుతోంది. ఇక ఈ శుక్ర‌వారం మంచు విష్ణు ఆచారి అమెరికా యాత్ర వ‌స్తోంది. ఈ సినిమా మ‌రీ ఎక్కువ థియేట‌ర్లు ఆక్ర‌మించ‌క‌పోయినా భ‌ర‌త్‌, సూర్య మ‌ధ్య‌లో రిస్క్ చేస్తూ థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. మే 4న సూర్య రిలీజ్ అయిన ఐదు రోజుల‌కే 9న మ‌హాన‌టి, ఆ త‌ర్వాత రెండు రోజుల‌కే పూరి మెహ‌బూబా వ‌స్తున్నాయి. ఈ సినిమాల మ‌ధ్య‌లో రాజ్ త‌రుణ్ రాజు గాడు అమ్మమ్మగారిల్లు వంటి చిన్న సినిమాలు విడుదలకు ఉన్నాయి. మహానటి నాపేరు సూర్య సినిమాలు గానీ హిట్ కొడితే అప్పుడు విడుదలయ్యే చిన్న సినిమాలకు ధియేటర్లు దక్కవు. 

 

ఇక మే 18న విజ‌య్ దేవ‌ర‌కొండ ట్యాక్సీ వాలా వ‌స్తోంది. అది చిన్న సినిమాయే అయినా విజ‌య్‌కు ఇటీవ‌ల ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. ఇక మే నెల చివ‌ర్లో 24న నేల టిక్కెట్‌, 25న నాగార్జున – వ‌ర్మ ఆఫీస‌ర్ వ‌స్తున్నాయి. ఇక 25నే క‌ళ్యాణ్‌రామ్ – త‌మ‌న్నా నా నువ్వే కూడా వ‌స్తోంది. ఇక ఏప్రిల్ 27న రావాల్సిన ర‌జ‌నీ కాలా జూన్ 7న వ‌స్తోంది. జూన్‌లోనూ నాగ‌చైత‌న్య స‌వ్య‌సాచి, నితిన్ శ్రీనివాస క‌ళ్యాణం ఉన్నాయి. ఆ త‌ర్వాత అంటే మ‌ళ్లీ స్కూల్స్ తెరిచాక‌, సెల‌వులు అయ్యాక ఏ జూలైలోనే చిన్న సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. దీనిని బ‌ట్టి చిన్న సినిమాల‌కు టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాడ్ టైం న‌డుస్తుందో ?  తెలుస్తోంది. 

 

టాలీవుడ్‌లో వీళ్ల‌కు బ్యాడ్ టైం స్టార్ట్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share