సునీల్‌కు హ్యాండిచ్చిన నిర్మాత…ఇక కష్టమే!

కమెడియన్‌గా టాలీవుడ్ తెరపై న‌వ్వులు పూయించి అన‌తికాలంలోనే హీరో అయిపోయాడు సునీల్‌. హీరోగా కెరీర్ స్టార్టింగ్‌లో వ‌రుస హిట్లు కొట్టిన సునీల్ ఆ త‌ర్వాత వ‌రుస ప్లాపుల‌తో విల‌విల్లాడుతున్నాడు. సునీల్‌కు వ‌రుస‌గా ఏడో ప్లాప్ త‌గిలింది. అస‌లు సునీల్ సినిమాల‌కు స‌రైన మార్కెట్ కూడా లేదు. ఇంత క్లిష్ట ప‌రిస్థితుల్లో సునీల్‌ను హీరోగా పెట్టి ఓ సినిమా చేద్దామ‌ని నిర్మాత శివ‌లెకం ప్ర‌సాద్ రెడీ అయ్యారు.

ఓ త‌మిళ సినిమా రైట్స్ తీసుకుని దానిని తెలుగులో రీమేక్ చేసేందుకు అంతా సిద్ధ‌మైంది. సునీల్‌కు అడ్వాన్స్ ఇవ్వ‌డం కూడా జ‌రిగింద‌ట‌. ఇంత‌లోనే ఏమైందో గాని స‌డెన్‌గా ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయిన‌ట్టు ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. నిర్మాత శివ‌లెంక ఈ సినిమా తీయ‌డం మానుకోవాల‌ని డిసైడ్ అయ్యాడ‌ట‌. వీరిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతోనే ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయిన‌ట్టు ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ టాక్‌.

తాజాగా శివ‌లెకం సుధీర్ బాబును హీరోగా పెట్టి ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారని టాక్‌. ఇక సునీల్ కూడా వ‌రుస‌గా త‌న సినిమాలు ప్లాప్ అవ్వ‌డంతో విసిగిపోయి తిరిగి కమెడియన్‌గా సెట్ కావాలనే ఆలోచనలో ఉన్నాడు. ఎన్టీఆర్ – త్రివిక్ర‌మ్ మూవీ నుంచి సునీల్ క‌మెడియ‌న్‌గా రీ ఎంట్రీ ఇవ్వొచ్చ‌ని లేదా అంత‌క‌న్నా ముందే మంచి ఆఫ‌ర్ వ‌చ్చినా సునీల్‌ను మ‌ళ్లీ మ‌నం క‌మెడియ‌న్‌గా వెండితెర మీద చూడొచ్చు.