హీరోయిన్ ఆఫర్ ఇస్తా…టాప్ డైరెక్ట‌ర్ పీఏ చేసిన నిర్వాకం

June 18, 2018 at 1:04 pm
tollywood, top director PA, women harassment, up coming heroine

సినిమాల్లో వేషాల పేరుతో యువతులను మోసగిస్తోన్న వాళ్ల ఉదంతాలు ఇటీవ‌ల ఎక్కువ అవుతున్నాయి. తాజాగా ఇదే పంథాలో వెళుతోన్న ఓ యువకుడిపై బంజారాహిల్స్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఫిల్మ్‌న‌గ‌ర్ భ‌గ‌త్‌సింగ్ కాల‌నీకి చెందిన మ‌ణికంఠ సాయి (25) తాను ఓ టాప్ డైరెక్ట‌ర్ పీఏన‌ని…. బ్యాంకు రుణం ఇప్పిస్తానని కీర్తిపల్లి సత్యనారాయణశర్మ వద్ద రూ.60 వేలు తీసుకున్నాడు. తరచూ అతడి ఇంటికెళ్లి ఆయన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

ఆమెతో ఉన్న సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పెడతానంటూ మణికంఠ బ్లాక్ మెయిలింగ్‌కు దిగాడు. తనపై ఫిర్యాదు చేస్తే భార్యను చంపడమే కాకుండా ఇద్దరి కొడుకులను కూడా అంతం చేస్తానంటూ బెదిరించసాగాడు. దీంతో స‌త్య‌నారాయ‌ణ శ‌ర్మ త‌న కుటుంబాన్ని నాశ‌నం చేయ‌డ‌మే కాకుండా, త‌న భార్య‌ను కూడా త‌న‌కు దూరం చేశాడ‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.

పోలీసుల విచార‌ణ‌లో ప‌లు విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. మ‌ణికంఠ‌ తాను ఓ అగ్రదర్శకుడి వద్ద పీఏగా పని చేస్తున్నానని సినిమాల్లో ఛాన్స్‌ ఇప్పిస్తానంటూ స్థానికంగా చాలా మంది యువ‌తుల‌ను వ‌ల‌లో వేసుకుని…. వారితో శారీరకవాంఛ తీర్చుకుంటున్న‌ట్టు ఆరోప‌ణ‌లు ఉన్న‌ట్టు టాక్‌. వారితో కోరిక‌లు తీర్చుకునే క్ర‌మంలో వారికి తెలియకుండా వీడియోలు తీసి తనపై ఫిర్యాదు చేస్తే ఆ వీడియో సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేస్తానంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతున్నాడ‌ట‌.

సినిమాల మీద మోజుతో మణికంఠను నమ్ముకొని వచ్చిన యువతులు సర్వం కోల్పోయారని శ‌ర్మ పోలీసుల‌కు వెల్లడించాడు. బంజారాహిల్స్‌ పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

heroin

హీరోయిన్ ఆఫర్ ఇస్తా…టాప్ డైరెక్ట‌ర్ పీఏ చేసిన నిర్వాకం
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share