‘ ట‌చ్ చేసి చూడు ‘ ప్రి రిలీజ్ బ‌జినెస్‌

February 1, 2018 at 6:39 pm
Touch Chesi Choodu, Pre Release Business, Raviteja

మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ తాజా సినిమా ట‌చ్ చేసి చూడు. విక్ర‌మ్ సిరికొండ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాకు న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), టీడీపీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీమోహ‌న్ సంయుక్తంగా నిర్మించారు. సెన్సార్ బోర్డు నుంచి యూ / ఏ స‌ర్టిఫికెట్ సొంతం చేసుకున్న ఈ సినిమాలో రాశీఖ‌న్నా, శీర‌త్‌క‌పూర్ హీరోయిన్లుగా న‌టించారు. ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ మాస్ మ‌హ‌రాజ్ స‌త్తాను చాటి చెప్పింది.

రాజా ది గ్రేట్ సినిమాతో ఫామ్‌లోకి వ‌చ్చిన ర‌వితేజ వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. ట‌చ్ చేసి చూడు త‌ర్వాత కుర‌సాల క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో నేల టిక్కెట్‌, ఆ త‌ర్వాత మైత్రీ మూవీస్ సంస్థ శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించే మ‌రో సినిమాలోనూ ర‌వితేజ న‌టిస్తున్నాడు. ఇక ట‌చ్ చేసి చూడు టోట‌ల్ ప్రి రిలీజ్ బిజినెస్ అదిరిపోతోంది. ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ 25.20 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది.

 

‘ ట‌చ్ చేసి చూడు ‘ ఏరియా వైజ్ ప్రి రిలీజ్ బిజినెస్ : ( రూ.కోట్ల‌లో)

నైజాం – 7.20

 

సీడెడ్ – 4.05

 

ఆంధ్రా – 10.0

 

రెస్టాఫ్ ఇండియా – 1.95

 

ఓవ‌ర్సీస్ – 2.0

————————————–

టోట‌ల్ వ‌ర‌ల్డ్ వైడ్ = 25.20 కోట్లు

—————————————

ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే రూ.26 కోట్ల షేర్, రూ.40 – 45 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టాల్సి ఉంటుంది. మ‌రి ర‌వితేజ‌పై బ‌య్య‌ర్లు కాన్ఫిడెంట్‌గానే భారీ రేట్ల‌కు ఈ సినిమా రైట్స్ కొన్నారు. మ‌రి ర‌వితేజ వీరి న‌మ్మ‌కాలు ఏం చేస్తాడో ?  ఎంత వ‌ర‌కు నిల‌బెడ‌తాడో ?  రేపే తేలిపోనుంది.

 

‘ ట‌చ్ చేసి చూడు ‘ ప్రి రిలీజ్ బ‌జినెస్‌
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share