త్రివిక్రమ్…ఆ ధీమాతోనే!

October 3, 2018 at 12:08 pm
Trivikram Srinivas, Aravindha sametha, US response, NTR

‘అరవింద సమేత వీరరాఘవ’ ట్రయిలర్ బయటకు వచ్చి ఒక్కరోజు కూడ పూర్తి కాకుండానే 5 మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతుంది, అది ఆలా ఉంటే ఈమూవీ ట్రైలర్ పై యాంటీ ఫ్యాన్స్ దాడి విపరీతంగా జరుగుతోంది. ఈ సినిమా ట్రైలర్ చూస్తున్నంత సేపు రాయలసీమ ఫ్యాక్షన్ హింసలు ఇంత దారుణంగా ఉంటాయా అన్నట్లు కనిపిస్తుంది. సినిమాలో ఫస్ట్ పార్ట్ లో ఎన్టీఆర్..పూజా హెగ్డెతో రొమాన్స్ చేయడం…కాస్త ఊరట ఇచ్చినా..తర్వాత రాయలసీమ బ్యాగ్ డ్రాప్ లో వచ్చే సీన్లు చూస్తుంటే ఒళ్లు ఒళ్లు గగుర్పోడుస్తుంది. త్రివిక్రమ్ ఏంటీ? ఈ ఫైట్లు, ఈ మాస్ మసాలా ఏంటీ అంటూ డిస్కషన్లు స్టార్ట్ అయ్యాయి.

1 (2)

ఈ ఫైట్లు..ఈ హింస చూస్తుంటూ..బోయపాటి శ్రీనివాస్ భారీ ఫైట్ సీన్లు గుర్తుకు వస్తున్నాయని అంటున్నారు ఫ్యాన్స్. అయితే ఎన్టీఆర్ ఇప్పటి వరకు రొమాంటిక్, సెంటిమెంట్ లాంటి సినిమాల్లో నటించాడు..అయితే ఇంద బీభత్సమైన పాత్రలు అప్పట్లో ఆది, సింహాద్రిలో నటించాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ ట్రెండ్ మార్చి ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. ఇదిలా ఉంటే..ఈ సినిమా ఓ అర్థగంట మాత్రమే బోయపాటి మార్క్ లా కాస్త హింసాత్మక సన్నివేశాలు ఉంటాయట..మిగిలిన సినిమా మొత్తం..హింసను ఎలా ఆపాలన్న థీమ్ తో కొనసాగుతుందట.

సగం లవ్వబుల్ గా, జోవియల్ గా వుంటుందట. అవన్నీ ట్రయిలర్ లోకి తీసుకువస్తే, ఫ్యాన్స్ జోష్ ఎలా వుంటుందో? అన్న ఆలోచనతో, ఈ విధంగా ట్రయిలర్ కట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ తరహా ఫైట్లు, ఈ హింస ధోరణిలో ఉంటే.. ఓవర్ సీస్ బయ్యర్ కిందకు సినిమాను అమ్ముకోవడం అన్నది కాస్త కష్టం అవుతుంది. ఎందుకంటే ఓవర్ సీస్ ఆడియన్స్ హింస వున్న సినిమాలకు కాస్త దూరంగా వుంటారు. మరి అవన్నీ తెలిసిన త్రివిక్రమ్ ఇలాంటి ట్రైలన్ ని రిలీజ్ చేయడం వెనుక ఉన్న స్ట్రాటజీ ఎంటో జనాలకు అర్థం కావడం లేదు. అది ఆలా ఉంటే త్రివిక్రమ్ కూడా సినిమా విడుదల అయిన తరువాత అసలు విషయం బయటకు పొక్కి, వాళ్లే ఆదరిస్తారనే త్రివిక్రమ్ ధీమా అయి ఉండొచ్చు అని అంటున్నారు.

త్రివిక్రమ్…ఆ ధీమాతోనే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share