మెగా ఫ్యాన్స్ కు షాక్…సంచ‌ల‌నంగా ఉద‌య్‌కిర‌ణ్ బ‌యోపిక్ టైటిల్

May 17, 2018 at 4:13 pm
Udaykiran Biopic, Movie, Director Teja, Title Registered, Mega fans

నేనే రాజు నేనే మంత్రి సినిమాతో చాలా రోజుల త‌ర్వాత ఫామ్‌లోకి వ‌చ్చిన ద‌ర్శ‌కుడు తేజ‌కు ఇప్పుడు మంచి ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. రాజు మంత్రి త‌ర్వాత తేజ‌కు ఇటు బాల‌య్య‌తో ఎన్టీఆర్ బ‌యోపిక్‌తో పాటు అటు మ‌రో సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వ‌చ్చింది. అయితే ఏమైందో గాని ఎన్టీఆర్ బ‌యోపిక్ నుంచి తేజ అనూహ్యంగా త‌ప్పుకున్నాడు. 

 

ఎన్టీఆర్ బ‌యోపిక్ నుంచి త‌ప్పుకున్న తేజ ఇప్పుడు మ‌రో సంచ‌ల‌న ప్రాజెక్టుకు రెడీ అవుతున్నాడు. అది ఓ దివంగ‌త యంగ్ హీరో బ‌యోపిక్ కావ‌డం విశేషం. చిన్న వయసులోనే హీరోగా ఊహించని స్టార్ డమ్ తెచ్చుకుని సంక్లిష్ట ప‌రిస్థితుల్లో ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఉద‌య్‌కిర‌ణ్ బ‌యోపిక్‌. ఇక ఈ సినిమాకు తేజ ఖ‌రారు చేసిన టైటిల్ ఇప్పుడు పెద్ద ప్ర‌కంప‌న‌లు రేపేదిగా ఉంది. ఈ సినిమాకు ‘కాబోయే అల్లుడు’ అనే టైటిల్ పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. 

 

తేజ ఈ సినిమాను స్వ‌యంగా త‌న బేన‌ర్ మీదే నిర్మించాల‌ని చూస్తున్నాడు. ఉద‌య్‌కిర‌ణ్ త‌క్కువ వ‌య‌స్సులోనే వ‌రుస హిట్ల‌తో దూసుకుపోవ‌డం, ఆ వెంట‌నే వ‌రుస ప్లాపుల‌తో కెరీర్‌లో కింద‌కు ప‌డిపోవ‌డం, మెగాస్టార్ పెద్ద కుమార్తెతో అత‌డికి ఎంగేజ్‌మెంట్ జ‌రిగి, ఆ త‌ర్వాత అది పెళ్లి వ‌ర‌కు వెళ్ల‌కుండానే క్యాన్సిల్ అవ్వ‌డం, చివ‌ర‌కు ఎన్నో సంక్లిష్ట ప‌రిస్థితుల్లో అత‌డు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం జ‌రిగాయి.

 

ఈ సంఘ‌ట‌న‌ల‌ను తేజ వెండితెర‌మీద ఎలా ప్ర‌జెంట్ చేస్తాడ‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. ఉద‌య్‌కిర‌ణ్ – తేజ ఇద్ద‌రి కెరీర్ చిత్రం సినిమా నుంచే స్టార్ట్ అయ్యాయి. తేజ డైరెక్ష‌న్‌లో ఉద‌య్ హీరోగా  ‘చిత్రం, నువ్వు నేను, ఔనన్నా కాదన్నా’ వంటి హిట్ సినిమాలు వ‌చ్చాయి.

 

మెగా ఫ్యాన్స్ కు షాక్…సంచ‌ల‌నంగా ఉద‌య్‌కిర‌ణ్ బ‌యోపిక్ టైటిల్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share