‘ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ’ వసూళ్ల సంగతేంటి?

యంగ్ ఎన‌ర్జిటిక్ రామ్ న‌టించిన ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ సినిమా ఈ శుక్ర‌వారం బాక్సాఫీస్ వేట స్టార్ట్ చేసింది. రామ్ – తిరుమ‌ల కిషోర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన నేను శైల‌జ సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో రిలీజ్‌కు ముందు ఈ జింద‌గీపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఈ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే తొలి రోజు రామ్ కెరీర్‌లోనే అత్య‌ధికంగా ఏకంగా రూ 3.63 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఇక ఫ‌స్ట్ వీకెండ్‌లో రూ.11 కోట్ల షేర్ కొల్ల‌గొట్ట‌డంతో ఈ సినిమా హిట్ కేట‌గిరిలోకి చేరుతుంద‌ని అంద‌రూ అంచ‌నా వేశారు.

అయితే ఫ‌స్ట్ వీకెండ్ ముగిసిన వెంట‌నే సినిమా సోమ‌, మంగ‌ళ‌వారాల్లో బాగా తేలిపోయింది. వీకెండ్ అయిన వెంట‌నే సినిమా వ‌సూళ్ల‌లో పెద్ద డ్రాప్ క‌నిపించింది. ఈ శుక్ర‌వారం బాక్సాఫీస్ వ‌ద్ద రాజ‌శేఖ‌ర్ గ‌రుడ‌వేడ – ఏంజెల్ – నెక్ట్ నువ్వే ఈ మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ మూడు సినిమాల‌కు చాలా థియేట‌ర్లు ఇవ్వ‌నున్నారు. ఇక జింద‌గీ పెర్పామ్ చేసేదే ఏ సెంట‌ర్ల‌లో.. మ‌రి ఈ కొత్త సినిమాలు మూడూ కూడా ఏ సెంట‌ర్ల‌ను టార్గెట్‌గానే చేసుకుని వ‌స్తున్నాయి. దీంతో రామ్ జింద‌గీ సేఫ్ జోన్‌లోకి వెళ్ల‌డం డౌట్‌గానే క‌నిపిస్తోంది.

ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ మొత్తం రూ.19 కోట్లు చేసింది. ప్ర‌స్తుతం సినిమా బాగా తేలిపోవ‌డంతో ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ అంతిమంగా ప్లాప్ అని తేలేలా ఉంది. రేపు రిలీజ్ అయ్యే సినిమాల్లో క‌నీసం ఒక‌దానికి హిట్ టాక్ వ‌చ్చినా జింద‌గీ ప‌ని క‌ష్ట‌మే. ఓవ‌రాల్‌గా ఈ సినిమా బ‌య్య‌ర్లు 25 శాతం న‌ష్టాల్లో మున‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.