ఫస్ట్ డే ‘యూటర్న’వసూళ్లు..నాట్ బ్యాడ్!

September 14, 2018 at 4:38 pm

నిన్న వినాయక చవితి కానుకగా సమంత నటించిన ‘యూటర్న్’ సినిమా రిలీజ్ అయ్యింది. ఇదే రోజు సమంత భర్త అక్కినేని నాగ చైతన్య నటించిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా కూడా రిలీజ్ అయ్యింది. యాధృచ్చికంగా ఒకే రోజు రిలీజ్ అయిన భార్యభర్తల సినిమాలకు మిశ్రమ స్పందన వచ్చినా..వసూళ్లు నాట్ బ్యాడ్ అంటున్నారు. టాక్ డివైడ్ గా లేకపోగా ఇలాంటి సినిమాలు ఇష్టపడే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో వసూళ్లు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నాయి.

U-Turn-1

దాదాపు 12 కోట్ల రూపాయల వసూళ్లను సాధిస్తే సమంత ‘యూటర్న్’ సేఫ్ వెంచర్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాను దాదాపు 16 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ మార్కెట్‌తో విడుదల చేశారు. ఇక థియేట్రికల్ బిజినెస్ 7 కోట్ల దాకా జరిగింది కాబట్టి ఇప్పుడున్న టాక్ సేఫ్ గా తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే 1 కోటి దాకా షేర్ రావడం విశేషమనే చెప్పాలి.

ఏరియా వైజ్ గా ‘యూటర్న్’కలెక్షన్లు :

నైజామ్ – 35 లక్షలు

సీడెడ్ – 10 లక్షలు

ఉత్తరాంధ్ర – 17 లక్షలు

గుంటూరు – 14 లక్షలు

ఈస్ట్ గోదావరి – 11 లక్షలు

వెస్ట్ – 6 లక్షలు

కృష్ణా – 14 లక్షలు

నెల్లూరు – 3 లక్షలు

రెండు తెలుగు రాష్ట్రాల మొదటి రోజు షేర్ – 1 కోటి 10 లక్షలు

బిజినెస్ ప్రకారం చూసుకున్నా మొదటిరోజే పదిహేను శాతం పైగా వెనక్కు ఇచ్చిన యుటర్న్ రైట్ ట్రాక్ మీద ఉందనే చెప్పాలి. సమంత సోలోగా నటించిన ఈ సినిమాకు 12 కోట్ల రూపాయల వసూళ్లు పెద్ద టార్గెట్టే. వాటిని రాబట్టుకోవడం అంత ఈజీ వ్యవహారం ఏమీ కాదు. అయితే ‘యూటర్న్’కు పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ థ్రిల్లర్ అలరిస్తుందని రివ్యూయర్లు పేర్కొన్నారు. తొలి రోజున ‘యూటర్న్’ యూఎస్ లో అరవై లక్షల రూపాయల వసూళ్లను సాధించినట్టుగా సమాచారం. ఈ వారంలో వసూళ్లను కనక స్టడీగా నిలబెట్టుకుంటే ఫైనల్ రన్ లోపు 7 కోట్లను దాటేయొచ్చు. మౌత్ టాక్ తో బాగా స్ప్రెడ్ అవుతున్న యుటర్న్ సక్సెస్ అయితే..సమంత టార్గెట్ కంప్లీట్ అయినట్లే లేక్క.

ఫస్ట్ డే ‘యూటర్న’వసూళ్లు..నాట్ బ్యాడ్!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share