బిచ్చగాడి ‘కాశి’ ఆశలు గల్లంతే..

May 18, 2018 at 3:36 pm
vijay antony, Kaasi, Movie, Result, Tamil

తెలుగు ఇండస్ట్రీలో డాక్టర్ సలీమ్, నకిలీ చిత్రాలతో హీరోగా పరిచయం అయిన తమిళ హీరో విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడు’ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయం సాధించారు.  ఒక తమిళ డబ్బింగ్ చిత్రం తెలుగు భారీ కలెక్షన్లు రాబట్టిందంటే..‘బిచ్చగాడు’ అనే చెప్పొచ్చు.  ఆ తర్వాత వచ్చిన బేతాళుడు, యమన్, ఇంద్రసేన చిత్రాలు వచ్చిన పెద్దగా విజయం సాధించలేదు.  సెన్సిబుల్ చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకొంటూ.. నటుడిగా, సంగీత దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన పంధాను ఏర్పరుచుకొన్న నటించిన తాజా చిత్రం ‘కాశి’. సినిమా విడుదలకు ముందే 7 నిమిషాల సినిమాను విడుదల చేసి కథపై ఆసక్తిని క్రియేట్ చేశాడు.  

 

ఇక ‘కాశీ’ చిత్రం విషయానికి వస్తే..అమెరికాలో గొప్ప డాక్టర్ గా ఉండే భరత్ (విజయ్ ఆంటోనీ) తల్లిదండ్రులతో హాయిగా జీవిస్తుంటాడు. కానీ అతని కలలో ఒక పాము, తనను ఎవరో పొడవటానికి ప్రయత్నిస్తున్నట్లు పదే పదే డిస్టబ్ చేస్తుంటాయి..ఆ కల ఎందుకు వస్తుంది..అసలు తన తల్లిదండ్రులు ఎవరు అన్న విషయాన్ని కనుక్కోవడానికి ఇండియా వస్తాడు. ఇండియా వచ్చిన భరత్ అసలు పేరు కాశీ అని తెలుసుకుంటాడు..తన చిన్నప్పుడే తల్లి చనిపోయిందని తెలుసుకుంటాడు. ఇక తన తండ్రి ఎవరు..ఎందుకు అతడి నుంచి దూరమయ్యాడు.. తన తండ్రిని కలుసుకున్నాడా..? అసలు భరత్ తన తండ్రికి ఎలా దూరమయ్యాడు..? అనే విషయంపైనే సినిమా కథ నడుస్తుంది. 

 

 ‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగునాట క్రేజ్ తెచ్చుకున్న నటుడు విజయ్ ఆంటోనీ సినిమా విడుదలవుతుందంటే ఇక్కడి ప్రేక్షకులు కూడా కొత్తదనం ఉంటుందని భావిస్తున్నారు.   విజయ్ ఆంటోనీ ఏం నచ్చి ఈ సినిమా ఎన్నుకున్నాడనే అన్న విషయం అర్థం కాలేదు.  చిన్నప్పుడే తన తల్లి తండ్రులకు దూరమైన పిల్లాడు పెద్దయిన తరువాత వారిని వెతుక్కుంటూ వెళ్ళడం అనే కాన్సెప్ట్ బాగానే ఉంది. కానీ తర్వాత వచ్చే పాత్రలే చాలా చిత్ర విచిత్రంగా ప్రజెంట్ చేశారు.  ప్రజలకు ఉచిత వైద్య సహాయం చేయడం, అందరి డిఎన్ఏ లను చెక్ చేస్తూ తనతో మ్యాచ్ అయిందో లేదో చూసుకుంటూ సినిమా మొత్తం ఇదే సాగుతుంది.మధ్యలో ”కాట్రాజు” లవ్ ట్రాక్ చెప్పడం పైగా అందులో విజయ్ ఆంటోనీను ఊహించుకోవడం అతిగా అనిపిస్తుంది.

 

ఇక గజదొంగ రత్తయ్య మరో లవ్ ట్రాక్.. ఇవన్నీ కథను పక్కదారి పట్టిస్తూ సినిమాపై ఆసక్తిని పోగొడతాయి. పైగా ఆయా ట్రాకుల్లో విజయ్ ఆంటోనీ డిఫరెంట్ గెటప్స్ లో కనిపించాడు. అంతే కాదు చర్చ్ ఫాదర్ క్యారెక్టర్‌లో మాత్రం విజయ్‌ కి అస్సలు నప్పలేదు. పాత్రల్లో పరకాయప్రవేశం చేసే విజయ్ ఆంటోనీ ఈ మూవీలో నటించేందుకు చాలా కష్టపడ్డాడు. లవ్, సెంటిమెంట్, రొమాన్స్ ఇలా ఏ ఒక్క ఎమోషన్‌ను  సరిగా ప్రజెంట్ చేయలేక పోయాడు. విజయ్ అందించిన సంగీతం, నేపధ్య సంగీతం బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కథకు తగ్గట్లుగా ఉంది. యాక్షన్ సీక్వెన్స్ లో కొన్ని షాట్స్ మెప్పిస్తాయి. ఎడిటింగ్ వర్క్ పై ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సివుంది. దర్శకురాలు కిరుతిగ ఉదయనిధి ఇంకాస్త ప్రయత్నించాల్సి ఉందని టాక్ వినిపిస్తుంది. మొత్తానికి విజయ్ ఆంటోనీ సినిమాల్లో కొత్తదనం ఆశించే ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా నిరాశ పరచడం ఖాయం.

 

సినిమాలో మైన‌స్ పాయింట్లు వెతికేందుకు ఏ మాత్రం క‌ష్ట‌ప‌డ‌క్క‌ర్లేదు. కావాల్సిన‌న్ని మైన‌స్ పాయింట్లు ఉన్నాయి. అస‌లే బోరింగ్‌గా సాకే క‌థ‌నం అనుకుంటే దానికి తోడు ప్రేక్ష‌కుడికి మ‌ధ్య‌లో రిలీఫ్ ఇస్తాయ‌నుకున్న పాట‌లు కూడా బాగోలేదు. ప్లాట్ స్టోరీ, నేప‌థ్య సంగీతం చెత్త‌గా ఉండ‌డం, క‌థ‌నం సాగ‌దీత‌, హీరో – హీరోయిన్ల మ‌ధ్య ల‌వ్ స్టోరీ ఎఫెక్టివ్‌గా లేక‌పోవ‌డం,  కామెడీ లేక‌పోవ‌డంతో కాశి విజ‌య్ ఆంటోనీకి మ‌రో ప్లాప్ ఇచ్చింది. అయితే పూర్తిగా కొత్త‌ద‌నం కోరుకునే ప్రేక్ష‌కులు వంద‌లో ఒక‌రో ఇద్ద‌రో ఉంటుంటారు… వారికి ఏ కొద్దో గొప్పో ఈ సినిమా న‌చ్చ‌వ‌చ్చేమో..! ఇక బిచ్చ‌గాడు నుంచి వ‌రుస ప్లాపులు ఎదుర్కొంటోన్న విజ‌య్‌కు ఈ సినిమా మ‌రింత ఘోర‌మైన రిజ‌ల్ట్ ఇస్తుంద‌న‌డంలో సందేహం లేదు.

 

బిచ్చగాడి ‘కాశి’ ఆశలు గల్లంతే..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share