దెబ్బకు ‘విజయ్ దేవరకొండ’ ఒరిజనల్ బయట పడింది!

October 19, 2018 at 12:25 pm

ఇండస్ట్రీలో ఒక్క హిట్ వస్తే చాలురా భగవంతుడా అనుకున్న సమయంలో వరుసగా మూడు సినిమాలు హిట్ సాధించడమే కాదు ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరడంతో టాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు విజయ్ దేవరకొండ. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతాగోవిందం సినిమాలతో వరుస విజయాలు అందుకున్న విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమా కూడా బారీ విజయం సాధిస్తుందని అనుకున్నారు. కానీ ఈ నెల 5న రిలీజ్ అయిన ‘నోటా’అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాతో మనోడు తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టాడు. కానీ ‘నోటా’ అనుకున్న విజయం సాధించలేదు. మాంచి స్పీడ్ మీదున్న బైకు ఒకే సారి పంక్చెర్ అయినట్టు అయింది దేవరకొండ పరిస్థితి, దాంతో ఇప్పుడు తర్వాత సినిమాలపై సందేహాలు మొదలయ్యాయి.

VijayDevarakonda(44)15398545631539874879

గతంలో కూడా వరుస విజయాలు అందుకున్న హీరోలు తర్వాత కనిపించకుండా పోయారు. ఇదే ఇప్పుడు విజయ్ కెరీర్ పై కూడా అనుమానాలు రావడం మొదలయ్యాయి. నోటా సినిమా కొట్టిన షాక్ కు విజయ్ దేవరకొండ ఒక్కసారికి తన ఒరిజినల్ పేరు బయటకు తీసారు. విజయ్ పూర్తి పేరు దేవరకొండ విజయ్ సాయి. అయితే విజయ్ దేవరకొండను స్క్రీన్ నేమ్ గా చేసుకున్నాడు. నోటా ఫ్లాప్ తరువాత ఏమయిందో ఇప్పుడు పేరును దేవరకొండ విజయ్ సాయి బయటకు తెచ్చారు. అంతే కాదు కేఎస్ రామారావు-క్రాంతి మాధవ్ కాంబినేషన్ సినిమా ఓపెనింగ్ జరిగింది. ఈ సినిమా ఇన్విటేషన్ లలో దేవరకొండ విజయ్ సాయి అని పేరు వేయడం విశేషం.

గీతాగోవిందం సూపర్ హిట్ కావడంతో..నోటాపై భారీ అంచనాలు పెట్టుకున్న విజయ్ ఆ సినిమాలో వాటా కూడా తీసుకుని, స్వంత బ్యానర్ కూడా ఫ్లోట్ చేసాడు. కానీ అనుకున్నదొక్కటీ..అయ్యిందొక్కటీ అన్న చందంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయ్యింది. దాంతో దేవరకొండ సెంటిమెంటల్ గా తన అసలు పేరును ఒక సారి ట్రై చేస్తే బాగుంటుందన్న సలహా వచ్చి వుండొచ్చు. ఆ ఉద్దెశంతో దేవరకొండ పూర్తి పేరు బయట పెట్టాడు.

దెబ్బకు ‘విజయ్ దేవరకొండ’ ఒరిజనల్ బయట పడింది!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share