‘ మెర్స‌ల్ ‘ క‌లెక్ష‌న్స్‌…. వ‌ర‌ల్డ్‌వైడ్ వీరంగం

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ న‌టించిన మెర్స‌ల్ (తెలుగులో అదిరింది) సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల‌తో దుమ్ము రేపుతోంది. విజ‌య్ సినిమా వ‌స్తుందంటే కోలీవుడ్‌లో బాక్సాఫీస్ రికార్డులు చెల్లా చెదుర‌వుతాయి. అయితే తుపాకీ, క‌త్తి సినిమాల త‌ర్వాత విజ‌య్‌కు ఆయ‌న రేంజ్‌కు త‌గ్గ హిట్ రాలేదు. తెరి (తెలుగులో పోలీసోడు) లాంటి ఒక‌టి రెండు హిట్లు వ‌చ్చినా అవి విజ‌య్ రేంజ్‌కు త‌గ్గ సినిమాలు అయితే కాదు.

ఇక తాజాగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో తేనాండ‌ల్ ఫిలింస్ సంస్థ బ్యాన‌ర్‌లో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన వందో సినిమాగా వ‌చ్చిన మెర్స‌ల్‌కు తొలి రోజు నుంచే సూప‌ర్ హిట్ టాక్ వచ్చింది. సినిమా రిలీజ్‌కు ముందు, రిలీజ్ త‌ర్వాత కూడా వివాదాల్లో చిక్కుకోవ‌డంతో సినిమాకు బాగా క‌లిసొచ్చింది. దీంతో మెర్స‌ల్ ఫ‌స్ట్ వీకెండ్‌లో మూడు రోజుల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏకంగా రూ.77 కోట్ల షేర్ కొల్ల‌గొట్టింది.

ఇది విజ‌య్ కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ ఫిగ‌ర్‌. కేవ‌లం త‌మిళ‌నాడులో మాత్ర‌మే ఈ సినిమా రూ 46.2 కోట్ల షేర్ కొల్ల‌గొట్టింది. ఏరియాల వారీగా మెర్సల్ క‌లెక్ష‌న్లు ఇలా ఉన్నాయి.

త‌మిళ‌నాడు – 46.2 ( రూ.కోట్ల‌లో )

కేర‌ళ – 4.7

క‌ర్ణాట‌క – 4.9

రెస్టాఫ్ ఇండియా – 0.7

—————————————

టోట‌ల్ ఇండియా షేర్ = 56.5

—————————————

యూఎస్‌+కెన‌డా- 4.4

యూఏఈ – 4.15

సింగ‌పూర్ – 2.15

శ్రీలంక – 1.55

యూకే – 1.40

ఫ్రాన్స్ – 1.10

ఆస్ట్రేలియా – 1.00

రెస్టాఫ్ ఓవ‌ర్సీస్ – 4.40

————————————————

టోట‌ల్ వ‌ర‌ల్డ్‌వైడ్ షేర్ = 77 కోట్ల షేర్‌

————————————————