పైర‌సీ పాలైన విజయ్ క్రేజ్

October 1, 2018 at 8:57 am

ఇండ‌స్ట్రీలో మాంచి దూకుడు మీదున్న విజ‌య్‌దేవ‌ర‌కొండ హీరోగా వ‌స్తున్న టాక్సీవాలా చిత్రం యూనిట్‌కు ఇది షాకింగ్ న్యూసే. నిజానికి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం నుంచీ అనేక అడ్డంకులను దాటుకుంటూ వ‌స్తోంది. అప్పుడెప్పుడో విడుద‌ల కావాల్సిన ఈ సినిమా సాంకేతిక‌, కాంట్రాక్ట్ అంశాల‌తో అనుకున్న స‌మ‌యంలో విడుద‌ల కాలేక‌పోయింది. ఈ క్ర‌మంలోనే మ‌రో షాకింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేమిటంటే.. ఈ సినిమా మొత్తం పైరసీకి గురైన‌ట్లు సమాచారం. యూవీ క్రియేష‌న్స్‌పై నిర్మించిన ఈ సినిమాలో యంగ్ త‌రంగ్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

114405

అన్నీ అయిపోయి.. ఇక విడుద‌ల చేద్దాం అనుకేనే లోపే.. విజ‌య్‌దేవ‌ర‌కొండ సినిమా గీత గోవిందం వచ్చింది. సరే దాని తరువాత చేద్దాం.. అనుకుంటున్న త‌రుణంలో నోటా ముందు విడుదల చేద్దాం.. అని విజయ్ మ‌రీ రిక్వెస్ట్ చేసినట్లు టాక్‌. ఇప్పుడు కొత్త‌గా టాక్సీవాలాను పైర‌సీ స‌మ‌స్య ఎదురైంది. ఇప్పుడు ఈ విష‌యం సినిమా యూనిట్‌ను తీవ్ర ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. ఈ సినిమా టోటల్ గా బయటకు వెళ్లిపోయిందని టాక్. సుమారు నాలుగు గంటల రా ఫుటేజ్ బయటకు వెళ్లిపొయిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఇక్క‌డ సినిమా యూనిట్ ఓ విష‌యంలో ఊపిరిపీల్చుకుంటుంద‌ట‌. అదేమిటంటే.. లీకైంది కేవ‌లం రా ఫుటేజ్ కావడం, డైలాగులు, రీ రికార్డింగ్, సిజి ల్లాంటివి ఏవీ లేకపోవడం.

ఈ లీకుల మూలాలు ప‌శ్చిమ‌ గోదావరి జిల్లా దేవరపల్లిలో బ‌య‌ట‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. అంతేగాకుండా .. ఈ సినిమా రా ఫుటేజీ ఆంధ్ర‌లోని ప‌లు జిల్లాల‌తోపాటు తెలంగాణ‌లోనూ చ‌క్క‌ర్లు కొడుతున్న‌ట్లు స‌మాచారం. దీనికి సంబంధించి ప‌లువురిని అరెస్టు కూడా చేసిన‌ట్లు స‌మాచారం, ఈ క‌ష్టాల‌ను సినిమా యూనిట్ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

పైర‌సీ పాలైన విజయ్ క్రేజ్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share