విజ‌య్ ‘ మెర్స‌ల్‌ ‘ కు అదిరే వ‌సూళ్లు

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘మెర్సల్’ మూవీ దీపావళి సందర్భంగా అక్టోబర్ 18న తమిళనాట విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమాను తెలుగులో 19న అదిరింది పేరుతో నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అధినేత శ‌ర‌త్‌మ‌రార్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే తెలుగు వెర్ష‌న్‌కు సంబంధించి సెన్సార్ ప‌నులు పూర్తికాక‌పోవ‌డంతో తెలుగులో అదిరింది సినిమాను అనుకున్న టైంకు రిలీజ్ చేయ‌లేక‌పోయారు.

తెలుగు వెర్ష‌న్ అదిరిందిని అక్టోబ‌ర్ 27కు వాయిదా వేశారు. ఇక దీపావ‌ళి కానుక‌గా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా 2500 థియేట‌ర్ల‌లో రిలీజ్ అయిన ఈ సినిమా తొలి రోజు అంచ‌నాల‌కు మించి రూ.31 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. త‌మిళ్‌లో విజ‌య్‌కు అదిరిపోయే ఫాలోయింగ్ ఉండ‌డంతో అక్క‌డ రూ.19 కోట్లు కొల్ల‌గొట్టింది. ఇక అమెరికాలో 250 స్క్రీన్లలో రిలీజ్ అయిన ఈ సినిమా అక్క‌డ తొలి రోజు రూ 2.25 కోట్లు రాబ‌ట్టింది.

మెర్స‌ల్ రిలీజ్‌కు ముందే వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ.160 కోట్ల బిజినెస్‌ను సాధించగా.. ఇప్పుడె సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్‌కి జోడీగా సమంత, కాజల్‌, నిత్యామేనన్‌ నటించగా.. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.