‘విజేత’ ప్రీమియర్ షో టాక్

July 12, 2018 at 9:38 am
Vijetha, Premier show talk, Kalyan dev

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు వచ్చారు..వస్తున్నారు.  ఇండస్ట్రీలో ఎవరి ఇమేజ్ వారు కాపాడుకుంటూ..ముందుకు సాగుతున్నారు.  ఎవరికి ఎవరూ పోలీ లేకుండా తమ కెరీర్ లో సత్తా చాటుతున్నారు.  ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిన్నల్లుడు శ్రీజ భర్త కళ్యాన్ దేవ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.  నిజంగానే ఒకప్పుడు చిరంజీవి హిట్ సినిమా టైటిల్ ‘విజేత’సినిమా ఈ రోజు రిలీజ్ అవుతుంది.  
 
కాగా, ఈ చిత్రం ప్రివ్యూ టాక్ అప్పడే వచ్చేసింది.  గతంలో చిరంజీవి సినిమాకు దగ్గర పోలికలే ఉన్నట్లు కనిపిస్తుంది..కాకపోతే ఆ సినిమాలో తన కుటుంబం గురించి ఎన్నో త్యాగాలు చేస్తారు చిరు.  ఈ చిత్రం విషయానికి వస్తే..ఓ మద్యతరగతి తండ్రి,కొడుకు మద్య సాగే సెంటిమెంట్ మనసులను కదలించి వేస్తుంది.  కుటుంబ భాద్యతలు లేకుండా హీరో తన ఫ్రెండ్స్ తో ఎప్పుడూ వీధుల్లో తిరుగుతూ..చిన్న చిన్న తగాదాలు తెస్తూ..ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతుంటాడు.  కొన్ని సార్లు కొడుకు గురించి తండ్రికి వచ్చే కాంప్లెంట్స్ తో విసిగిపోతుంటాడు..మురళీ శర్మ. ఇంటర్వెల్ కి ముంది తండ్రి ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడం అసలు ట్విస్ట్, ఇక హీరో కళ్యాణ్ దేవ్ ఎలా కష్ఠాలను అదిగమించి గెలిచాడో అసలు కథ. 
 
ఈ నేపథ్యంలో తనికేళ్ల భరణి, కళ్యాన్ దేవ్ ల మద్య కొన్ని ఎమోషనల్ సన్నీవేశాలు..యువతను కదిలించేలా ఉన్నాయి.  ఫస్టాఫ్ మొత్తం హీరో జులాయిగా తిరగడం చూపించినా..సెకండ్ ఆఫ్ లో తన మనసు మార్చుకొని హీరోయిన్ మాలవికా నాయర్ సహాయంతో జీవితంలో సెటిల్ ఎలా అయ్యాడు అనే విషయాన్ని దర్శకులు  రాకేశ్ శశి బాగానే తీసినట్లు టాక్ వినిపిస్తుంది.  
 
మురళీశర్మ, తనికెళ్ల భరణి, మాలవిక శర్మ, నాజర్ తమ పాత్రలకు తగిన ప్రాధాన్యం ఇచ్చారు.  కామెడీ పరంగా సత్యం రాజేష్ ఇతర క్యారెక్టర్ బాగానే నవ్వించారు.   హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం నాట్ బ్యాడ్ అనిపించినా..పాటలు పెద్దగా ఆకర్షించుకోలేక పోయాయి.  నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.  మొత్తానికి ఈ సినిమా పాత కథే కానీ కొత్తదనంగా చెప్పినట్లు ఉంది. 

‘విజేత’ ప్రీమియర్ షో టాక్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share