ఎన్టీఆర్ అంటే నాకు భయం : విశాల్

October 28, 2018 at 10:55 am

జూనియ‌ర్ ఎన్టీఆర్‌పై విశాల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో వైర‌ల్ అవుతున్నాయి. ఎన్టీఆర్‌ను త‌ట్టుకోలేన‌ని ఆయ‌న డైరెక్టుగానే చెప్ప‌డంతో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ఇంత‌కీ ఆయ‌న ఎందుకీ కామెంట్స్ చేశాడో చూద్దాం.. ఎన్టీఆర్ కెరీర్‌లో టెంప‌ర్ సినిమా ఎంతో ప్ర‌త్యేకం. ఇప్పుడు ఆ సినిమాను త‌మిళంలో రిమేక్ చేస్తున్నారు. ఇందులో హీరో విశాల్ న‌టిస్తున్నాడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఈ సినిమాను ఉన్న‌ది ఉన్న‌ట్టుగా రిమేక్ చేయ‌డం లేద‌ని.. తాజా ప‌రిస్థితుల‌కు అనుగుణంగా క‌థ‌ను మారుస్తున్నామ‌ని, అది కూడా మీ టూ ఉద్య‌మ నేప‌థ్యంలో ఉంటుంద‌ని ఆయ‌న చెప్పుకొచ్చాడు.

Temper HD Stills (114)

`ఇప్పుడు నడుస్తున్న మీ-టు వివాదాలకు కనెక్ట్ అయ్యే సినిమాగా దీన్ని మారుస్తున్నాం. సినిమాలో చాలా మార్పులు ఉంటాయి. మరీ ముఖ్యంగా క్లయిమాక్స్ లో చాలా పెద్ద విషయాన్ని చర్చించబోతున్నాం. లైంగిక వేధింపులపై చర్చ ఎక్కువగా జరుగుతున్న ఇలాంటి టైమ్ లో రావాల్సిన సినిమా ఇది. కాబట్టి టెంపర్ తమిళ రీమేక్ కు ఇదే సరైన సమయం. ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ ను మాత్రం నేను బీట్ చేయలేను. ఏడాదిన్నర కిందట టెంపర్ చూశాను. మరోసారి చూడమని డైరక్టర్ కోరితే చూడనని చెప్పాను. ఎందుకంటే ఇంకోసారి చూశానంటే నేను ఎన్టీఆర్ మాయలో పడిపోతాను. అతడిలానే నటించడానికి ప్రయత్నిస్తాను. అది నాకు ఇష్టం లేదు` అని విశాల్ చెప్ప‌డం గ‌మ‌నార్హం.

అంతేగాకుండా.. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ ఎందుకు చేయ‌కూడ‌దో కూడా చెప్పాడు. `నా ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది. టెంపర్ రీమేక్ కూడా తెలుగులో రిలీజ్ చేయొచ్చు. ఎందుకంటే తెలుగు వెర్షన్ కు, తమిళ వెర్షన్ కు చాలా మార్పులు చేశాం. సినిమా కొత్తగానే ఉంటుంది. కానీ తెలుగులో రిలీజ్ చేయను. ఎందుకంటే, తెలుగులో విడుదల చేస్తే నా నటనను ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ తో కంపేర్ చేస్తారు. అది నాకు భయం. ఎన్టీఆర్ ఒక సినిమా చేశాడంటే అది 10-12 ఏళ్లు గుర్తుంటుంది. కాబట్టి టెంపర్ రీమేక్ ను మళ్లీ తెలుగులో రిలీజ్ చేయడం మంచిపని కాదు` అని విశాల్ అన్నాడు. నిజానికి.. మిర్చి, అత్తారింటికి దారేది సినిమాల రీమేక్స్ కోసం కూడా మేకర్స్ తనను సంప్రదించారని, కానీ టెంపర్ మాత్రమే రీమేక్ చేయాలని తనకు అనిపించిందంటున్నాడు విశాల్‌.

ఎన్టీఆర్ అంటే నాకు భయం : విశాల్
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share