దేశ‌భ‌క్తి మిళిత యాక్ష‌న్‌… ‘ విశ్వ‌రూపం 2 ‘ ట్రైల‌ర్ (వీడియో)

June 11, 2018 at 5:39 pm
Vishwaroopam 2,  Kamal Haasan, NTR
ఐదారు సంవ‌త్స‌రాలుగా క‌మ‌ల్‌హాస‌న్ విశ్వ‌రూపం 2 సినిమా ఊరిస్తూ వ‌స్తోంది. ఏళ్ల‌కు ఏళ్లుగా ఊరిస్తోన్న ఈ సినిమా ట్రైల‌ర్ ఎట్ట‌కేల‌కు ఈ రోజు ట్రైల‌ర్ లాంచ్ చేసుకుంది. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ఈ ట్రైల‌ర్‌ను ఆవిష్క‌రించారు. ట్రైల‌ర్ చూస్తుంటే దేశ‌భ‌క్తి మిలిత యాక్ష‌న్ సినిమా అని అర్థ‌మైపోతోంది. ట్రైల‌ర్‌లో ప్ర‌తి షాట్‌ను యాక్ష‌న్‌తోనే నింపేశారు.
 
ట్రైల‌ర్‌ను బ‌ట్టి చూస్తుంటే సినిమా అంతా యాక్ష‌న్ నేప‌థ్యంలోనే స్ప‌ష్ట‌మ‌వుతోంది. క‌మ‌ల్ ఎప్ప‌టి లాగే యాక్ష‌న్‌తో పాటు రెండు మూడు షార్ట్‌ల‌లో రొమాన్స్ కూడా పండించాడు. రొమాంటిక్ సీన్లు కూడా అదిరిపోతాయ‌ని ట్రైల‌ర్ చెపుతోంది. 
తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కానున్న విశ్వరూపం 2 ట్రైలర్‌ను హిందీ వెర్ష‌న్‌లో అమీర్ ఖాన్, తమిళ వెర్షన్‌లో శృతి హాసన్, తెలుగు వెర్షన్‌లో ఎన్టీఆర్ విడుదల చేశారు. 
 
రాహుల్ బోస్, పూజా కుమార్ మరియు ఆండ్రియా, నాజ‌ర్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి గిబ్రాన్ మ్యూజిక్ అందించారు. ప్రస్తుతం యూఎస్‌లో పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్‌ని కంప్లీట్ చేసుకుని ఆగష్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

దేశ‌భ‌క్తి మిళిత యాక్ష‌న్‌… ‘ విశ్వ‌రూపం 2 ‘ ట్రైల‌ర్ (వీడియో)
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share