కమల్ ‘విశ్వరూపం 2’కి భారీ నష్టం

August 13, 2018 at 10:59 am
Viswaroopam 2, Kamalhassan, movie, disaster, loss

విశ్వనటుడు కమల్ హాసన్ సినిమా అంటే దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొంటుంది. ప్రయోగాలకు కేరాఫ్ అడ్రాస్ అయిన కమల్ హాసన్ ఈ మద్య ఆ తరహా సినిమాలు తీయకపోవడంతో అభిమానుల్లో కాస్త ఆసక్తి తగ్గిందనే చెప్పాలి. 2013 రిలీజ్ అయిన విశ్వరూపం ఎన్నో అవాంతరాల మద్య రిలీజ్ అయి మంచి సక్సెస్ సాధించింది. అయితే వెంటనే ఈ సినిమా సీక్వెల్ కి ప్లాన్ చేశారు..కానీ అప్పట్లో నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ ఫైనాన్సు సమస్యల కారణంగా సినిమా రిలీజ్ కుదరలేదు.

మొత్తానికి కమల్ హాసన్ స్వయంగా రంగంలోకి దిగి ఎలాగో అలా సినిమా పూర్తి చేసి అభిమానుల ముందుకు తీసుకు వచ్చారు. అయితే మొదటి భాగం విశ్వరూపం సూపర్ హిట్ కనుక సీక్వెల్ కూడా మంచి హిట్ అవుతుందని భావించారు..కానీ అంచనాలు అన్నీ తలకిందులు అయ్యాయి. మొదటి భాగంలో ఉన్న ఎంట్రటైన్ మెంట్, యాక్షన్ సీక్వెల్ లో లేకపోవడం ప్రేక్షకులకు రుచింరలేదు. క లీడింగ్ న్యూస్ పేపర్లో ప్రచురించిన కథనం ప్రకారం ఈ సినిమా రైట్స్ ను కమల్ పర్సనల్ రిక్వెస్ట్ పై రిలయన్స్ సంస్థ కొనడం జరిగిందట.

2018-06-11-1

అయితే సినిమాపై వస్తున్న టాక్ తో దేశ వ్యాప్తంగా భారీ కలెక్షన్ల సంగతి దేవుడు ఎరుగు పెట్టుబడులైనా రాబడుతుందా లేదా అన్న అనుమానాలు వస్తున్నాయట. అంతే కాదు సినిమా పరిస్థితి చూస్తుంటే కనీసం వాళ్ళకు పాతిక కోట్ల రూపాయల నష్టం తప్పేలా లేదట. ప్రస్తుతం కమల్ రాజకీయాలపై ఫోకస్ పెట్టడంతో ఆయన సినిమాలు ఎక్కువ తీసే అవకాశాలు లేకపోవచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు.

కమల్ ‘విశ్వరూపం 2’కి భారీ నష్టం
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share