వైజాగ్ సన్నీ లియోన్…ఓ ఊపు ఊపింది

June 20, 2018 at 11:34 am
Vizag, Sun leone, album song, trending, social media

బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది నోరా ఫతెహ్. అప్పుడప్పుడు తన హాట్ బెల్లీ డ్యాన్స్ తో కుర్రాల మతులు పోగొడుతూ..విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. బాలీవుడ్ లో నటించిన చిత్రాలు తక్కువే అయినా..ఈ అమ్మడికి సోషల్ మీడియాలో ఫోటో షూట్స్, డ్యాన్స్ వీడియోలతో బాగా పాపులారిటీ తెచ్చుకుంది. పూరి జగన్నాధ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ‘టెంపర్’సినిమాలో తారక్ టెంప్టింగ్ పెర్ఫామెన్స్‌కి చేదోడుగా నిలిచిన ఐటమ్ నంబర్ గుర్తుందా? ఇట్టాగే రెచ్చిపోదాం.. అంటూ అటూఇటూ తెగ ఊపేసిన నోరా ఫతేహి.. తన గ్లామర్‌తో మళ్ళీ వార్తల్లోకెక్కేసింది.

తాజాగా నోరా ఫతేహ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. నోరా స్టెప్పులు ఇప్పుడు ఇంటర్నెట్‌లో సెన్షేషన్‌గా మారాయి. మొరాక్కోకు చెందిన ఘజాలి సాంగ్‌కు ఆమె డ్యాన్స్ చేసింది. ఈ డ్యాన్స్ వీడియో వైరల్ కావడంతో..‘మా వైజాగ్‌కి.. ఇదే సన్నీ లియోన్ రోయ్..!’ అంటూ ప్రకాష్‌రాజ్ ఆన్‌స్క్రీన్‌లో ఈమెను సర్టిఫై చేశాడు కూడా. నడుం కింది మరియు పైభాగాల్ని కళాత్మకంగా ఊపెయ్యడమనే అరుదైన ఫీట్‌లో నోరాకి మించినవారు లేరంటే అతిశయోక్తి లేదు.

ఆఫ్రో, బాలీవుడ్ స్టయిల్‌లో డ్యాన్స్ కొనసాగుతుంది. టైగర్స్ ఆఫ్ సుందర్‌బాన్స్ చిత్రంలో నోరా అరంగేట్రం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. ‘ఘజాలి’ అంటూ జోరుగా సాగే మొరాకన్ సాంగ్‌కి పెర్ఫామ్ చేస్తూ నోరా ఊపిన ఊపుడుకి నెటిజన్లు ఫ్లాట్ అయిపోయారు. ముంబై, గోవా బీచుల్లో తీసిన ‘కొరియోగ్రఫిక్ షాట్స్’ యూత్‌ని పిచ్చెక్కించడం ఖాయం. ఈ వీడియోకొస్తున్న ఆదరణ చూస్తుంటే.. ‘ఘజాలి’ డాన్స్ అనేది ఒక ట్రెండ్ సెట్టర్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

వైజాగ్ సన్నీ లియోన్…ఓ ఊపు ఊపింది
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share