‘ ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ ‘ బాక్సాఫీస్ రిపోర్ట్‌… అస‌లు ప‌రీక్ష స్టార్ట్‌

రామ్ లేటెస్ట్ మూవీ ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ ఫ‌స్ట్ వీకెండ్ వ‌సూళ్ల వ‌ర‌కు బాగానే జింద‌గీ చేసింది. సినిమాకు జ‌స్ట్ ఓకే టాక్ ఉన్నా కూడా ఫ‌స్ట్ వీకెండ్‌లో మూడు రోజుల‌కు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ. 10.8 కోట్ల షేర్.. రూ.17.4 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం. ఇక మూడు రోజుల వ‌సూళ్ల‌తో రామ్ రెండు రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు.

రూ 3.63 కోట్ల ఫ‌స్ట్ డే హ‌య్య‌స్ట్ షేర్‌తో పాటు ఫ‌స్ట్ వీకెండ్‌లో రూ 10 కోట్ల షేర్‌తో మ‌రో రికార్డు కూడా న‌మోదైంది. గత ఏడాది వచ్చిన ‘నేను శైలజ’ కంటే ఇది మెరుగైన వసూళ్లే సాధించింది. ఇక ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.19 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌ర‌గ‌డంతో ఈ సినిమా మ‌రో రూ.8 కోట్ల షేర్ రాబ‌డితేనే సేఫ్ జోన్‌లోకి వ‌స్తుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు రామ్‌కు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర రాజా ది గ్రేట్ మిన‌హా ఏ సినిమా పోటీ లేదు. అయితే వ‌చ్చే శుక్ర‌వారం నాలుగు సినిమాలు థియేట‌ర్ల‌లోకి దిగుతున్నాయి. మ‌రి ట‌ఫ్ కాంపిటేష‌న్ త‌ట్టుకుని రామ్ ఎంత‌వ‌ర‌కు సేఫ్ జోన్‌లోకి వ‌స్తాడో ? చూడాలి. రామ్‌కు ఈ శుక్ర‌వారం నుంచే అస‌లు ప‌రీక్ష స్టార్ట్ కానుంది.

ఇక ఫ‌స్ట్ వీకెండ్‌లో ఈ సినిమా ఏరియా వైజ్ షేర్ ఇలా ఉంది

నైజాం – 3 .79

సీడెడ్ -1 .41

ఉత్తరాంధ్ర -1 .14

గుంటూరు – 0 .75

కృష్ణా – 0 .67

ఈస్ట్ – 0 .64

వెస్ట్ – 0 .48

నెల్లూరు – 0 .25

————————————

ఏపీ+తెలంగాణ = 9.13 కోట్లు

———————————–

ఓవర్సీస్ – 0 .95

రెస్ట్ అఫ్ ఇండియా – 0 .85

———————————————–

టోటల్ వరల్డ్ వైడ్ షేర్ : 10 .93 కోట్లు

———————————————–