స‌చిన్ బ‌యోపిక్‌లో స‌చిన్ ఎవ‌రో తెలుసా..

February 14, 2017 at 11:15 am
sachin

బాలీవుడ్ లో ఇప్పుడు బయోపిక్ ల కాలం నడుస్తోంది. తాజాగా బాలీవుడ్ మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్ ఆమీర్‌ఖాన్ న‌టించిన దంగ‌ల్ సినిమా రిలీజ్ అయ్యి ఏకంగా రూ.400 కోట్ల షేర్ రాబ‌ట్టింది. అలాగూ భాగ్ మిల్కా భాగ్.. అజహర్.. ధోనీ ఇలా బ‌యోపిక్‌ల‌కు ఇక్క‌డ మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. బ‌యోపిక్‌ల‌కు వ‌స్తోన్న రెస్పాన్స్‌ను చూసిన ప‌లువురు ఆ ప్రముఖుల లైఫ్ స్టోరీల‌ను సినిమాలుగా తీసేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు.

ఈ క్ర‌మంలోనే భార‌త లెజెండ‌రీ క్రికెట‌ర్‌, క్రికెట్ దేవుడిగా అంద‌రూ ఆరాధించే స‌చిన్ టెండుల్క‌ర్ జీవితం మీద ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. ‘‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’’ పేరిట నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 26న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ వార్త భార‌త క్రికెట్ అభిమానుల‌కు ఓ పండ‌గే.

ఈ చిత్రంలో స‌చిన్ టెండుల్క‌ర్‌రోల్‌ను పోషించే వ్య‌క్తి తెలిస్తే మ‌నం షాక్ అవ్వాల్సిందే. స‌చిన్ టెండుల్క‌ర్ రోల్‌ను స‌చిన్ కుమారుడు అర్జున్ కనిపిస్తాడని వెల్లడించారు. జేమ్స్ ఎర్స్ కన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. స‌చిన్ కుమారుడు అర్జున్ యంగ్ స‌చిన్‌గా క‌నిపిస్తుండ‌డంతో ఈ సినిమాకు మ‌రింత క్రేజ్ వ‌చ్చింది.

 

స‌చిన్ బ‌యోపిక్‌లో స‌చిన్ ఎవ‌రో తెలుసా..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts


Share
Share