యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘ఏడు చేపలు’!

November 5, 2018 at 12:31 pm

ఈ మద్య వెండితెరపై అడల్ట్ కాంటెంట్ తో వస్తున్న సినిమాలకు విపరీతమైన గిరాకీ ఉంటుంది. ఒకప్పుడు లిప్ లాక్ అంటేనే అబ్బో అనుకునేవాళ్లు..కానీ ఇప్పుడు ప్రతి సినిమాలోనూ లిప్ లాక్ సీన్లు సర్వ సాధారణం అయ్యాయి. ఇక బాలీవుడ్ లో అయితే ఈ కల్చర్ మరింత ఘోరంగా తయారైంది..లిప్ లాక్ సీన్లు, బాత్ రూమ్, బెడ్ రూమ్ సీన్లతో పూర్తి స్థాయిలో అడల్ట్ కాంటెంట్ తో వస్తున్న సినిమాలకు విపరీతమైన కలెక్షన్లు వస్తున్నాయి. ఇలాంటి సినిమాలు స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా నడుస్తున్నాయి.

pic

ఇక తెలుగులో కూడా ఈ మద్య అడల్డ్ కాంటెంట్ సినిమాలకు బాగానే వస్తున్నాయి. ఆ మద్య రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్‌100 లాంటి సినిమాల్లో లిప్ లాక్ సీన్లు యువ‌త‌ను బాగా ఆకర్షించాయి. కొన్ని టీజర్స్, ట్రైలర్ లతోనే ఉక్కిరిబిక్కిరి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా ‘మీ టూ ’ ఉద్యమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పలువురు హీరోయిన్లు గతంలో తమ పట్ల జరిగిన లైంగిక దాడుల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ హల్ చల్ చేస్తున్నారు.

తాజాగా దర్శకుడు శామ్ జే చైతన్య దర్శకత్వంలో అడ‌ల్ట్ కంటెంట్‌తో తెర‌కెక్కిన‌ ‘ఏడు చేపల కథ’సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో ఆడవారిని చూస్తే..టేమ్ట్ అయ్యే యువకుడు కొంత మంది ఆడవాళ్లతో ఎలా ప్రవర్తిసాడు..వాళ్లు అతన్ని ఎలా వాడుకుంటారు అన్న కాన్సెప్ట్ పై రూపొందినట్లు కనిపిస్తుంది. అయితే ఈ టీజర్ లో పూర్తి స్థాయిగా అడల్డ్ కాంటెంట్ లా ఉంది.

Yedu-Chepala-Katha-Movie-New-HD-Stills-2

‘యూట్యూబ్‌లో అప్‌లోడ్ అవుతుంది 5 నిమిషాలు… నీకుంట‌ద‌మ్మో.. మా అమ్మ‌కి చెబుతా.. మీ..టూ’ అంటూ విడుద‌లైన ఏడుచేప‌ల క‌థ టీజ‌ర్ యూట్యూబ్‌ లో దుమ్మురేపుతుంది. ఈ టీజర్ లో అమ్మాయిలు, ఆంటీలు హీరోతో చేస్తున్న రోమాన్స్..లిప్‌లాక్‌, బెడ్‌రూం సీన్ల‌కు యువత బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అన్ని ఛాన‌ల్స్ క‌లిపి 16 మిలియ‌న్స్ వ్యూస్ రావ‌టంతో న‌యా రికార్డ్ క్రియేట్ చేసింది ఏడుచేప‌ల‌క‌థ టీజ‌ర్.

యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘ఏడు చేపలు’!
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share