యువత మొబైల్ డేటా అంతా ఆ పాడు పనికేనా..

June 4, 2018 at 8:48 am
Youth, Mobile data, Users, Most data, for videos

భార‌త టెలికాం రంగంలోకి జియో ఎంట్రీతో ఇక్కడ నెట్ వినియోగం స్వ‌రూప‌మే మారిపోయింది. జియో ప్రీ డేటా ఇవ్వ‌డంతో మిగిలిన డేటా కంపెనీలు పోటాపోటీగా డేటా రేట్ల‌ను బాగా త‌గ్గించేశాయి. ఒక‌రికి ఒక‌రు పోటీ ప‌డి మ‌రీ రేట్లు త‌గ్గిస్తూ ఇత‌ర టెలికం ఆప‌రేట‌ర్ల‌కు ఉన్న వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షిస్తున్నాయి. ఈ ఆల్ ఫ్రీ డేటా వార్ వ‌ల్ల దేశ‌వ్యాప్తంగా గ‌త యేడాది కాలంగా విప‌రీతంగా టెలికం వినియోగ‌దారుల సంఖ్య పెరిగింది.

ఈ పెరుగుదల సంతోష‌మే అయినా దీని వ‌ల్ల వ‌చ్చిన లాభం సంగ‌తి ఎలా ఉన్నా యువ‌త పెడ‌దోవ ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. కొన్ని స‌ర్వే సంస్థ‌లు చేసిన స‌ర్వేలో ఈ ప్రీ డేటా వినియోగం వ‌ల్ల యువ‌త‌లో మ‌హిళ‌లు, పురుషులు కూడా ఎక్కువుగా పోర్న్ వీడియోల‌కు బానిస‌లుగా మారిన‌ట్టు సర్వేలు చెపుతున్నాయి.

ఉచిత డేటా వినియోగం ఎక్కువైన నేప‌థ్యంలో వీడియో టెక్నాల‌జీకి చెందిన విడోలి అనే సంస్థ యువ‌తపై ఇంట‌ర్నెట్ ప్ర‌భావం ఎలా ఉంది ?ఈ ఫ్రీ డేటా ఆఫ‌ర్ల వ‌ల్ల యువ‌త దానిని ఎలా స‌ద్వినియోగం చేసుకుంటున్నారు ? దీని వ‌ల్ల లాభాలేంటి ? న‌ష్టాలు ఏంటి ? అన్న ప్ర‌శ్న‌ల‌పై చేసిన స‌ర్వేలో గ‌తంలో కంటే నేటి యువ‌త పోర్న్ బానిస‌ల‌కు గురై అసాంఘీక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నార‌ని తేలింది.

మెట్రో న‌గ‌రాల నుంచి చిన్న చిన్న ప‌ట్ట‌ణాలు, గ్రామాలు, ప‌ల్లెల‌కు కూడా ఈ జాడ్యం పాకేసింద‌ట‌. 2018 జ‌న‌వ‌రి నుంచి మార్చి వ‌ర‌కు మ‌న‌దేశంలో ఉన్న నెటిజన్లు 130కోట్ల బీజీకి పైగా వాడుకున్నారు. ఈ డేటా వినియోగం గ‌త ఏడాదితో 9 రేట్లు పెరిగింది. ఈ డేటాలో 80 శాతం కేవ‌లం వీడియోలు…ఇందులో పోర్న్ వీడియోలు చూసేందుకే ఎక్కువ వాడుతున్నార‌ని తేలింద‌ట‌.

18-24 ఏళ్ల వ‌య‌సున్న‌వారు 48 శాతం పైగా సెక్స్ వీడియోలు చూస్తున్నారు. అంతేకాదు 2011లో రోజుకు 1 నుంచి 1.5 కోట్ల‌మంది డేటాను వినియోగిస్తుంటే వారిసంఖ్యం 2017కి 30కోట్ల‌కు చేరింది. ఈ లెక్క‌న అయితే 2050కి వ‌స్తే రోజుకి 65కోట్ల‌మంది నెట్ వినియోగించుకుంటార‌ని అంచ‌నా. ఈ ప‌రిణామం వ‌ల్ల‌ యువ‌త భ‌విష్య‌త్తుకు పెనుముప్పుగా మారే ప్ర‌మాదం ఉందని ప‌లు స్వచ్ఛంద సంస్థ‌లు కూడా ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి.

యువత మొబైల్ డేటా అంతా ఆ పాడు పనికేనా..
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share