జగన్ అభిమానులకు డబుల్ బొనాంజా…

September 12, 2018 at 6:49 pm

తెలుగు చిత్ర సీమలో ఇప్పుడు మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు తెలుగులో సినీ తారలపైనే బయోపిక్ లు వస్తున్నాయి..అయితే మొదటి సారిగా రాజకీయ నేపథ్యంలో కూడా ఓ బయోపిక్ తెరకెక్కుతుంది. తాజాగా ప్రియతమ నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’ తెరకెక్కుతుంది.

ysr-yatra11536751071

వైఎస్. రాజశేఖర్ రెడ్డి మొదటి సారిగా ముఖ్యమంత్రి కావడానికి ముందు ఆయన అలుపెరుగకుండా పాద యాత్ర చేశారు. దాంతో ప్రజల్లో ఎంతో నమ్మకాన్ని పొందారు..అందుకే ఈ సినిమాకు ‘యాత్ర’అని పేరు పెట్టారు. వైఎస్ గా మమ్ముట్టి నటిస్తోన్న ఈ సినిమాకి, మహి.వి రాఘవ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాను వైఎస్ జగన్ పుట్టినరోజైన డిసెంబర్ 21వ తేదీన అట్టహాసంగా విడుదలచేయనున్నారు

ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్ కి సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది. అందువలన సినిమాపై అంచనాలు బాగానే వున్నాయి. ఇక ఈ సినిమా స్టోరీ ఎంటీ..అనేదానిపై ఎలాంటి లీకేజీలు కాకుండా చాలా జాత్రత్త పడుతుంది చిత్ర యూనిట్. అంతే కాదు షూటింగ్ కూడా చాలా జాగ్రత్తగా కానిచ్చేస్తున్నారు..ఎలాంటి లీకేజీలకు తావివ్వకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. దాంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో అన్న క్యూరియాసిటి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో పెరిగిపోయింది.

Dm5HRfmXcAA9ppo

జగన్ అభిమానులకు డబుల్ బొనాంజా…
0 votes, 0.00 avg. rating (0% score)

commentsRelated Posts


Share
Share